Jai Hind: జైహింద్.. అంటూ చంద్రబాబు ఎమోషనల్ ​పోస్ట్

by Thanuru Gopichand |   (  Updated:2025-05-07 03:33:28  IST  )

ఆపరేషన్ ​సింధూర్​పై కేంద్ర మంత్రులు, పలువురు ముఖ్యమంత్రులు స్పందిస్తున్నారు.

Jai Hind: జైహింద్.. అంటూ చంద్రబాబు ఎమోషనల్ ​పోస్ట్
X

దిశ, డైనమిక్​ బ్యూరో : ఆపరేషన్ ​సింధూర్​పై కేంద్ర మంత్రులు, పలువురు ముఖ్యమంత్రులు స్పందిస్తున్నారు. ఈ క్రమంలోనే ఏపీ సీఎం చంద్రబాబు (CM Chandrababu) సైతం ఈ ఘటనపై రియాక్ట్ అయ్యారు. ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన ఇండియన్ ఆర్మీ(Indian Army) ట్వీట్ ని రీట్వీట్ చేసి జై హింద్ అని రాసుకొచ్చారు. పహల్గాం దాడి తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) అమరావతి రాజధాని పున:ప్రారంభానికి ఏపీకి వచ్చారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ టెర్రరిస్టులపై (Terrorist) ప్రధాని, కేంద్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకున్నా తాము మద్దతు ఇస్తామంటూ తెలిపారు. పహల్గాం ఉగ్రదాడి దేశాన్ని తీవ్ర వేదనకు గురిచేసిందన్నారు. బాధితుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. దేశ భద్రతను కాపాడటంలో ప్రధాని నాయకత్వానికి పూర్తి మద్దతు ఇస్తున్నాం అని ఆయన తెలిపారు.

Next Story