ఎన్టీఆర్‌కు చంద్రబాబు క్రేజీ రిప్లై..

by Gantepaka Srikanth |   (  Updated:2026-04-22 17:07:08  IST  )

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. రాజకీయ, సినీ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

ఎన్టీఆర్‌కు చంద్రబాబు క్రేజీ రిప్లై..
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. రాజకీయ, సినీ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అయితే, గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ (తారక్) చేసిన ట్వీట్, ఆయన చంద్రబాబు రిప్లై ఇచ్చిన విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. తారక్ తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతా ద్వారా చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ.. "హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు చంద్రబాబు మావయ్యా.. మీరు ఆయురారోగ్యాలతో ఇలాగే నిండు నూరేళ్లు వర్ధిల్లాలని కోరుకుంటున్నాను" అని పోస్ట్ చేశారు. చాలా కాలం తర్వాత తారక్ నేరుగా 'మావయ్యా' అని సంబోధిస్తూ ట్వీట్ చేయడం అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది.

చంద్రబాబు క్రేజీ రిప్లై..

తారక్ చేసిన ట్వీట్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. "థాంక్యూ సో మచ్ అమ్మా.." అంటూ ఆయన బదులిచ్చారు. అయితే చంద్రబాబు తన రిప్లైలో 'అమ్మా' అని పిలవడం వారి మధ్య ఉన్న ఆత్మీయ అనుబంధాన్ని ప్రతిబింబిస్తోందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి రాజకీయాలతో సంబంధం లేకుండా మామ-అల్లుళ్ల మధ్య జరిగిన ఈ పలకరింపులు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Next Story