- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యోగాపై చంద్రబాబు ప్రకటన.. ఇక ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ క్లాసెస్ !
11వ యోగా అంతర్జాతీయ దినోత్సవం ( International Day of Yoga) ఈ నెల 21వ విశాఖ పట్టణంలో ( Vizag) నిర్వహిస్తామని కీలక ప్రకట

దిశ, వెబ్ డెస్క్ : 11వ యోగా అంతర్జాతీయ దినోత్సవం ( International Day of Yoga) ఈ నెల 21వ విశాఖ పట్టణంలో ( Vizag) నిర్వహిస్తామని కీలక ప్రకటన చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ( Nara Chandrababu Naidu). గురువారం యోగాంధ్రపై సీఎం చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా యోగా దినోత్సవం పై (Day of Yoga) .. వాటి ఏర్పాట్లపై కీలక వ్యాఖ్యలు చేశారు. యోగా.. ఆరోగ్యానికి ఎంతో మంచిదని... మెడిసిన్ లాగా శరీరానికి పనిచేస్తుందని వెల్లడించారు.
భవిష్యత్తులో యోగాపై ప్రత్యేకంగా ఆఫ్ లైన్, ఆన్లైన్ శిక్షణ, కోర్సులు నిర్వహిస్తామని కూడా వివరించారు. యోగా నెలను డిక్లేర్ చేయనున్నట్లు కూడా స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు నాయుడు. యోగా కోసం రెండు కోట్ల మందిని రిజిస్ట్రేషన్ చేయాలనుకున్నామని... కానీ ఆ సంఖ్య 2.30 కోట్లకు చేరిందన్నారు. 120 శాతం లక్ష్యం సాధించామని వెల్లడించారు. 88.71 శాతం మంది ప్రజలు యోగాలో.. ఇప్పటివరకు పాల్గొంటున్నారని వివరించారు.
విశాఖలో ప్రపంచ యోగా దినోత్సవం పెద్ద ఈవెంట్ గా నిర్వహించబోతున్నట్లు పేర్కొన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. ఇది గిన్నిస్ బుక్ లో ఎక్కుతుందని కూడా చెప్పారు. బాడీ ఫిట్నెస్ కోసం కచ్చితంగా యోగా చేయాలని కోరారు. గత నెల రోజుల నుంచి చేపట్టిన యోగా కార్యక్రమం బాగా జరిగిందని గుర్తు చేశారు. దాదాపు కోటి 77 లక్షల మంది వచ్చి యోగాలో పాల్గొన్నారని స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు నాయుడు.
CM Chandrababu Yoga Campaign:






