Ambati : సంతానంపై చంద్రబాబు రెండు నాల్కల ధోరణి : అంబటి ఫైర్

by Y. Venkata Narasimha Reddy |   (  Updated:2025-01-17 06:31:16  IST  )

పిల్లల్ని కనడంపై ఏపీ(AP) సీఎం చంద్రబాబు( CM Chandrababu) రెండు నాల్కల ధోరణితో వ్యవహిరిస్తున్నారని వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు ఎక్స్ వేదికగా మండిపడ్డారు.

Ambati : సంతానంపై చంద్రబాబు రెండు నాల్కల ధోరణి : అంబటి ఫైర్
X

దిశ, వెబ్ డెస్క్ : పిల్లల్ని కనడంపై ఏపీ(AP) సీఎం చంద్రబాబు( CM Chandrababu) రెండు నాల్కల ధోరణితో వ్యవహిరిస్తున్నారని వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు ఎక్స్ వేదికగా మండిపడ్డారు. ఎన్నికల్లో ఎంత మంది ఉన్నా అందరికీ "తల్లికి వందనం" అని మోసం చేశావని.. అధికారంలోకి వచ్చాక ఇప్పుడేమో లెక్కలేకుండా పిల్లల్ని కనమంటున్నావ్, సిగ్గుందా ? అని చంద్రబాబు తీరుపై అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాజాగా చంద్రబాబు రాష్ట్ర జనాభా పెంచాలంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో జనాభా పెంచేందుకు.. కనీసం ఇద్దరు పిల్లలు ఉంటేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అర్హతకు సంబంధించిన చట్టం తెస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఇంతకుముందు జనాభాను నియంత్రించాలని ప్రోత్సాహకాలు ఇచ్చేవాళ్లమని పేర్కొన్న చంద్రబాబు.. ఇప్పుడు జనాభా పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. గతంలో ఒక కుటుంబంలో ఐదుగురు సభ్యులు ఉంటే గరిష్ఠంగా 25 కిలోల బియ్యం ఇచ్చేవాళ్లమని.. అంతకంటే ఎక్కువ ఉన్నా.. 25 కిలోలకు మించి ఇచ్చేవాళ్లం కాదని పేర్కొన్నారు. అంతేకాకుండా ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఇద్దరి కంటే ఎక్కువమంది పిల్లలు ఉంటే అనర్హులుగా గుర్తిస్తూ చట్టం తెచ్చామని గుర్తు చేశారు. అయితే అదంతా అప్పటి పరిస్థితి అని.. కానీ ఇప్పుడు జనాభా పెంచాలని. అందుకే ఇప్పుడు కనీసం ఇద్దరు పిల్లలు ఉంటేనే స్థానిక సంస్థల్లో పోటీ చేసేందుకు అర్హత కల్పిస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

ఇక నుంచి రాష్ట్రంలో ప్రభుత్వం ఏ పథకం అమలు చేయాలన్నా కుటుంబం ఎంత పరిమాణం ఉంటుంది అనేది ప్రామాణికంగా తీసుకుంటామని సీఎం స్పష్టం చేశారు. జనాభా ఒకప్పుడు భారం అని.. కానీ ఇప్పుడు అది ఆస్తి అని తేల్చి చెప్పారు. భవిష్యత్‌లో రాష్ట్రంలో జనాభా తగ్గే అవకాశాలు ఉన్నాయని.. అయితే ఇది చాలా ప్రమాదకరమని ముఖ్యమంత్రి వెల్లడించారు. దక్షిణ రాష్ట్రాల్లో మన జనాభా సంఖ్య తగ్గిపోతోందని, అందుకే ఇద్దరు పిల్లలు లేకపోతే స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీకి అనర్హత అనే నిబంధన తీసుకువస్తామని చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ జనా భా 2026లో 5.38 కోట్లు ఉంటుందని అంచనాలు ఉన్నాయని పేర్కొన్న చంద్రబాబు.. 2031 వరకు ఆ సంఖ్య 5.42 కోట్లకు పెరుగుతుందని.. ఆ తర్వాత 2036లో 5.44 కోట్లకు చేరుతుందని చెప్పారు. అయితే 2041లో మాత్రం ఏపీ జనాభా 5.42 కోట్లకు తగ్గిపోయి.. అక్కడి నుంచి క్రమంగా తగ్గుతూ 2051 నాటికి 5.41 కోట్లకు చేరుతుందని చంద్రబాబు తెలిపారు.

2026లో రాష్ట్రంలో ఒక జంటకు సగటున 1.51 మంది జన్మిస్తే (టోటల్‌ ఫెర్టిలిటీ రేట్‌-టీఎఫ్‌ఆర్‌)... 2051 నాటికి అది 1.07కి తగ్గిపోతుందని అంచనాలు చెబుతున్నాయన్నారు. ఇది ప్రమాదకరమని, ఒక జంటకు సగటున 2.1 మంది పిల్లలు జన్మిస్తేనే... జనాభా సక్రమ నిర్వహణ సాధ్యపడుతుందన్నారు. సమాజంలో పిల్లలను కనే విషయంలో పాజిటివ్‌గా ఉండేలా అవగాహన కల్పించాలన్నారు. మన జనాభాను పెంచుకోవడం ద్వారా 2047లో మన వాళ్లే అన్ని‌చోట్లా రాణించే వీలు ఉంటుందని, పాపులేషన్ మేనేజ్మెంట్ గురించి అందరూ మాట్లాడాలనని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.

Next Story