నోరు పారేసుకుంటే.. నోర్లు మూయించే శక్తి ఎన్డీయేకి ఉంది: చంద్రబాబు

by Ajay Maddhiboyina |

అన‌వ‌స‌రంగా నోరు పారేసుకుంటే నోర్లు మూయించే శ‌క్తి ఎన్డీయేకు ఉంద‌ని సీఎం చంద్ర‌బాబు వార్నింగ్ ఇచ్చారు. క‌ర్నూలు జిల్లా జొన్న‌గిరి స‌భ‌లో ఆయ‌న మాట్లాడుతూ సాయికృష్ణ మృతి కేసుపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

నోరు పారేసుకుంటే.. నోర్లు మూయించే శక్తి ఎన్డీయేకి ఉంది: చంద్రబాబు
X

దిశ‌, వెబ్ డెస్క్: అన‌వ‌స‌రంగా నోరు పారేసుకుంటే నోర్లు మూయించే శ‌క్తి ఎన్డీయేకు ఉంద‌ని సీఎం చంద్ర‌బాబు వార్నింగ్ ఇచ్చారు. క‌ర్నూలు జిల్లా జొన్న‌గిరి స‌భ‌లో ఆయ‌న మాట్లాడుతూ సాయికృష్ణ మృతి కేసుపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. గొడ్డ‌లి పార్టీ నాయ‌కులు రాత్రింభ‌వ‌ళ్లు కుట్ర‌లు చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. సాయికృష్ణ మృతి కేసులో సీఐ కాపునే.. బాధితుడు కాపు కుల‌స్తుడేన‌ని చెప్పారు. దానికి కూడా రాజ‌కీయ రంగు ప‌లిమి ప‌వ‌న్ క‌ల్యాణ్ పై నోరు పారేసుకున్నార‌ని మండిప‌డ్డారు. అలాంటి వాళ్ల ఖ‌బ‌డ్దార్ జాగ్ర‌త్త అంటూ హెచ్చ‌రించారు.

రాష్ట్రాన్ని కులం, మ‌తం, ప్రాంతం, వ‌ర్గాల వారిగా రోజూ విషాన్ని చిమ్ముతున్నార‌ని మండిప‌డ్డారు. ఇదిలా ఉంటే విజ‌య‌వాడ సాయికృష్ణ కేసు రాష్ట్రంలో సంచ‌ల‌నంగా మారిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే సాయికృష్ణ‌ది లాక‌ప్ డెత్ అని నిర్దారించారు. కేసు నుండి త‌ప్పించుకునేందుకు నాగ‌రాజు సాక్ష్యాలు అన్నీ మాయం చేశాడ‌ని సిట్ విచార‌ణ‌లో తేలింది. కేసులో ముద్దాయిగా ఉన్న సీఐ నాగ‌రాజుకు కోర్టు రిమాండ్ విధించింది. దీంతో ఆయ‌న‌ను రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైలుకు త‌ర‌లించారు. జూలై 8న నాగ‌రాజును తిరిగి కోర్టులో ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు.

Next Story