- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చంద్రబాబు శ్రీశైలం పర్యటన ఖరారు
టీడీపీ అధినేత చంద్రబాబు శ్రీశైలం పర్యటన ఖరారు అయింది..

X
దిశ, వెబ్ డెస్క్: ఏపీలో మే 13న ఎన్నికలు జరగనున్నాయి. దీంతో టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. శనివారం ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఆయన పర్యటించారు. అయితే తన తదుపరి పర్యటన ఖరారు అయింది. చంద్రబాబు కర్నూలు జిల్లా శ్రీశైలంలో పర్యటించనున్నారు. ఈ నెల 22న (సోమవారం) శ్రీశైలం మల్లన్నను దర్శించుకోనున్నారు. సోమవారం ఉదయం చంద్రబాబు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో సున్నిపెంట హెలీప్యాడ్‌కు చేరకుంటారు. అనంతరం ప్రత్యేక కాన్వాయ్‌లో రోడ్డు మార్గాన శ్రీశైలం వెళ్తారు. మార్గం మధ్యలో సాక్షి గణపతిస్వామిని దర్శించుకోనున్నారు. అదే రోజు ఉదయం 11.40 నుంచి 12.30 నిమిషాల మధ్య స్వామి అమ్మవార్లను చంద్రబాబు దర్శించుకోని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
Also Read...
Next Story






