- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మీ ఆగ్రహం.. ధర్మాగ్రహం కావాలి.. వెరైటీగా చంద్రబాబు ఉగాది విషెస్
ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ట్విట్టర్ వేదికగా రెండు రాష్ట్రాల ప్రజలకు వెరైటీ విషెస్ తెలిపారు.

X
దిశ, వెబ్‌డెస్క్: ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ట్విట్టర్ వేదికగా రెండు రాష్ట్రాల ప్రజలకు వెరైటీ విషెస్ తెలిపారు. ‘రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వారందరికీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు! ఈ ఎన్నికల సమయంలో మనందరం క్రోధి నామ తెలుగు సంవత్సరంలో అడుగు పెడుతున్నాం. క్రోధి అంటే కోపంతో ఉన్నవారు అని అర్థం. అయితే నేడు మీ ఆగ్రహం...ధర్మాగ్రహం కావాలి. ఆ ఆగ్రహంలో చెడు అంతా దహనమై....ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే చల్లని పాలన మొదలవ్వాలని కోరుకుందాం. ఈ ఉగాది మీ ఇంటిల్లిపాదికీ శుభాలను కలిగించాలని, మీ కుటుంబ సభ్యులకు ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, అభివృద్ధిని అందించాలని కోరుకుంటూ... ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు.’ అని ట్వీట్ చేశారు.
Next Story






