- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేడు తూ.గో, చిత్తూరు జిల్లాలకు చంద్రబాబు.. పర్యటన షెడ్యూల్ ఇదే
ఏపీ సీఎం చంద్రబాబు నేరుగా ప్రజల వద్దకే వెళ్లి పథకాలను అమలు చేస్తున్నారు. బహిరంగ సభలు, సచివాలయం నుండి

దిశ, వెబ్ డెస్క్: ఏపీ సీఎం చంద్రబాబు నేరుగా ప్రజల వద్దకే వెళ్లి పథకాలను అమలు చేస్తున్నారు. బహిరంగ సభలు, సచివాలయం నుండి కాకుండా గ్రామాల్లోకి వెళ్లి పథకాన్ని అమలు చేస్తూ ప్రజల అభిప్రాయాలను సైతం తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలోనే నేడు ఆయన చిత్తూరు, తూర్పు గోదావరి జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా కొవ్వూరు నియోజకవర్గంలో చంద్రబాబు స్వయంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు.
ఈ రోజు రాత్రి ఆయన కప్పంలో బస చేయనున్నారు. అంతే కాకుండా రేపు నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొంటారు. రేపు రాత్రి ఉండవల్లిలోని తమ నివాసంలో బస చేయనున్నారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తరవాత ఇచ్చిన హామీలను ఒక్కక్కటిగా అమలు చేస్తోంది. ఎన్టీఆర్ భరోసా కింద పెన్షన్లను సైతం ఒకటవ తేదీనే పంపిణీ చేస్తోంది. పెన్షన్ల పంపిణీని స్వయంగా చంద్రబాబే ప్రారంభిస్తున్నారు.






