- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Yoga: మన్‌కీ బాత్‌లో.. యోగాంధ్ర.. కృతజ్ఞతలు తెలిపిన చంద్రబాబు
ఈ రోజు జరిగిన మన్‌కీ బాత్‌లో ప్రధాన మంత్రి ప్రత్యేకంగా ఏపీలో జరగనున్న యోగా డే గురించి ప్రస్తావించారు.

దిశ, డైనమిక్ బ్యూరో : ఈ రోజు జరిగిన మన్‌కీ బాత్‌లో (Mann Ki Baat) ప్రధాన మంత్రి Narendra modi ప్రత్యేకంగా ఏపీలో జరగనున్న యోగా డే గురించి ప్రస్తావించారు. జూన్ 21న విశాఖపట్నంలో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవం మహాసంభరానికి ఎదురు చూస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. మనం కలిసికలసి ఈ ఉత్సవాన్ని జరుపుకుందాం అని పిలుపునిచ్చారు. నాకు ఈసారి విశాఖపట్నంలో (Visakhapatnalm) యోగా దినోత్సవం (Yoga Day) కార్యక్రమంలో పాల్గొనే అవకాశం లభిస్తోందన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ఇప్పుడు నెల కన్నా తక్కువ సమయం ఉందని, మీరు ఇప్పటికీ యోగా చెయ్యకుండా ఉండి ఉంటే, ఇప్పటికైనా మొదలు పెట్టాలని ఆయన సూచించారు. 2015,జూన్ 21 వ తేదీన యోగా దినోత్సవం మొదలైనప్పటి నుంచీ యోగా కి ఆకర్షణ పెరిగిందన్నారు. ఈసారి కూడా యోగా దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలలో ఉత్సాహం, ఉల్లాసము కనిపిస్తున్నాయని అన్నారు.
ప్రధాని మన్‌కీబాత్‌లో యోగా అంశాన్ని ప్రస్తావించడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu) ఎక్స్‌ఖాతాలో స్పందించారు. యోంగాధ్రను ప్రస్తావించినందుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ సంక ల్పం కోసం ఐక్యంగా ముందుకు సాగుతున్నారని ఆయన పేర్కొన్నారు. జూన్ 21 వరకు నెల రోజుల పాటు, రాష్ట్రవ్యాప్తంగా, ముఖ్యంగా 100 పర్యాటక ప్రదేశాల్లో యోగా కార్యక్రమాలు నిర్వహించనున్నామని ఆయన తెలిపారు. ఇందులో భాగంగా అనేక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశామన్నారు. యోగాను మన దైనందిన జీవనశైలిలో భాగంగా మార్చే దిశగా ముందడుగు వేస్తున్నామని సీఎం తెలిపారు.






