- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హైదరాబాద్ టూ సింగపూర్..చంద్రబాబు పర్యటన షెట్యూల్ ఇదే
ఏపీ సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటన షెడ్యూల్ సిద్దమైంది. శనివారం నుండి ఆరు రోజుల పాటు చంద్రబాబు సింగపూర్‌లో పర్యటిస్తారు.

దిశ, వెబ్ డెస్క్: ఏపీ సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటన షెడ్యూల్ సిద్దమైంది. శనివారం నుండి ఆరు రోజుల పాటు చంద్రబాబు సింగపూర్‌లో పర్యటిస్తారు. పెట్టుబడులను సాధించడమే లక్ష్యంగా చంద్రబాబు ఈ పర్యటనకు వెళుతున్నట్టు సమాచారం. పర్యటనలో ఇన్ఫ్రా ప్రాజెక్టులు, లాజిస్టిక్ కేంద్రాలను చంద్రబాబు సందర్శించనున్నారు. అక్కడి వ్యాపారవేత్తలతో సమావేశం కానున్నారు. సింగపూర్‌లో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కంపెనీలు ఉంటాయి.
అదే విధంగా ప్రముఖ కంపెనీల యజమానులు ఉంటారు. కాబట్టి వారితో భేటీ అవ్వడం ద్వారా ఏపీకి భారీగా పెట్టుబడులు తీసుకురావచ్చని భావిస్తున్నారు. అంతే కాకుండా సింగపూర్ లోని ప్రవాస భారతీయులను సైతం సీఎం కలిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. స్వరాష్ట్ర అభివృద్ధి కోసం ముందుకు రావాలని కోరబోతున్నట్టు సమాచారం. ఇక ఇప్పటికే సింగపూర్ పర్యటనపై అధికారులతో చంద్రబాబు సమీక్షించారు. ఈరోజు సాయంత్రం ఆయన హైదరాబాద్ చేరుకుంటారు. రేపు సింగపూర్ బయలుదేరుతారు.






