‘రియల్ హీరో’.. పవన్ కల్యాణ్‌పై చంద్రబాబు ప్రశంసల వర్షం

by Disha Web Desk 19 |
‘రియల్ హీరో’.. పవన్ కల్యాణ్‌పై చంద్రబాబు ప్రశంసల వర్షం
X

దిశ, వెబ్‌డెస్క్: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై టీడీపీ చీఫ్, మాజీ సీఎం చంద్రబాబుపై ప్రశంసల వర్షం కురిపించారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం తణుకులో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి సభ నిర్వహించారు. ఈ సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ కేవలం సినిమాల్లోనే హీరో కాదు.. కోట్ల సంపాదన వదులుకుని ప్రజల కోసం నిలబడ్డ నిజమైన హీరో అని ప్రశంసించారు. వైసీపీ పవన్‌పై వ్యక్తిగత దాడికి పాల్పడ్డ ప్రజల కోసం అన్ని భరించి నిలబడ్డారని కొనియాడారు. వైసీపీ అక్రమాల్ని అడ్డుకోవాలంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని చెప్పిన వ్యక్తి పవన్ కల్యాణ్ అని చెప్పారు.

జగన్ సర్కార్‌ను గద్దె దింపడం కోసం సీట్ల పంపకాల్లో కూడా పవన్ కల్యాణ్ త్యాగం చేశారని పేర్కొన్నారు. జగన్ కబంధ హస్తాల నుండి రాష్ట్రాన్ని కాపాడుకోవడానికే మాడు పార్టీలు చేతులు కలిపాయన్నారు. రాష్ట్రంలో అగ్నికి వాయువు తోడైంది.. ప్రజాగళానికి వారాహి తోడైంది.. నాకు పాలనలో అనుభవం ఉంది.. పవన్ కల్యాణ్‌కు పవర్ ఉంది.. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయమని జోస్యం చెప్పారు. మూడు పార్టీలు కలిశాక వైసీపీకి ఎన్నికల్లో డిపాజిట్లు వస్తాయా అని ఎద్దేవా చేశారు. సైకిల్ స్పీడ్‌కు తిరుగులేదు.. గ్లాస్ జోరుగా ఎదురు లేదని చంద్రబాబు కార్యకర్తల్లో జోష్ నింపారు.



Next Story

Most Viewed