Chandrababu: తల్లికి వందనంపై నేడు చంద్రబాబు సమీక్ష

by Ajay Maddhiboyina |

తల్లికి వందనం పథకంపై సీఎం చంద్రబాబు నేడు సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. పథకం ఎలా అమలు అవుతోంది, ప్రజల్లో నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తోంది

Chandrababu: తల్లికి వందనంపై నేడు చంద్రబాబు సమీక్ష
X

దిశ, వెబ్ డెస్క్: తల్లికి వందనం పథకంపై సీఎం చంద్రబాబు నేడు సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. పథకం ఎలా అమలు అవుతోంది, ప్రజల్లో నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తోంది అనే వివరాలతో పాటు ఇతర వివరాల గురించి అధికారులతో చర్చించనున్నారు. రాష్ట్రంలో తల్లికి వందనం పథకం కింద అర్హుల ఖాతాల్లో డబ్బులు జమ చేసిన సంగతి తెలిసిందే. తల్లుల ఖాతాల్లో రూ.13వేల చొప్పున జమ చేస్తున్నారు. 8,745 కోట్లు విడుద‌ల చేయ‌గా 67 ల‌క్ష‌ల మందికి ల‌బ్ది చేకూరుతుంది.

ఫస్ట్ క్లాస్ లో చేరేవారికి, ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో చేరేవారికి మాత్రం ఇంకా డబ్బులు జమ చేయలేదు. అడ్మిషన్ల ప్రక్రియ పూర్తైన తరవాత వచ్చే నెలలో వారికి కూడా డబ్బులు అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ పథకంపై రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. ఒకే తల్లికి 340 మంది పిల్లలు ఉన్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. మరోవైపు వైసీపీ లోకేష్ పై విమర్శలు చేస్తోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు అధికారులతో సమీక్షలో పథకం అమలు అవుతున్న తీరు గురించి తెలుసుకోనున్నారు.

Next Story