Chandrababu Naidu : అప్పులతో తిప్పలు : చంద్రబాబు

by Muthe.Rajitha |   (  Updated:2025-01-27 11:17:28  IST  )

2022-2023 ఆర్థిక సంవత్సరానికి ఏపీకి చెందిన నీతి అయోగ్ రిపోర్ట్(NITI AYOG Report) పై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(AP CM Chandrababu Naidu) సంతృప్తి వ్యక్తం చేశారు.

Chandrababu Naidu : అప్పులతో తిప్పలు : చంద్రబాబు
X

దిశ, వెబ్ డెస్క్ : 2022-2023 ఆర్థిక సంవత్సరానికి ఏపీకి చెందిన నీతి అయోగ్ రిపోర్ట్(NITI AYOG Report) పై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(AP CM Chandrababu Naidu) సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అభివృద్ధి పనులు చేసి, రాష్ట్ర సంపద పెంచాలి గాని, అప్పులు(Credits) చేస్తే ఇబ్బందులు తప్పవని ఆయన పేర్కొన్నారు. నాయకుల అసమర్థత వలన సరైన నిర్ణయాలు తీసుకోకపోతే, రాష్ట్ర ఆర్థికస్థితి కుంటుపడుతుందని అభిప్రాయ పడ్డారు. తద్వారాఅభివృద్ధికి నిధులు లేక, అప్పుల పాలయ్యి, ఆ భారం ప్రజలపై మోపాల్సి వస్తుందని అన్నారు. రాష్ట్ర భవిష్యత్తు గురించి నాయకులు ముందుచూపుతో ఆలోచిస్తేనే ఆర్థికంగా బాగుపడతామని ఆయన తెలియజేశారు. రాష్ట్రాలు బాగుంటేనే.. దేశం ఆర్థికంగా ఎదుగుతుందని, ఆ దిశగా నాయకులు, అధికారులు కష్టపడి పనిచేయాలని చంద్రబాబు వెల్లడించారు. రాష్ట్రంలో వైసీపీ ఆర్థిక విధ్వంసం సృష్టించిందని, ప్రభుత్వ కార్యాలయాలను సైతం తాకట్టు పెట్టిందని మండిపడ్డారు. ఐదేళ్లలో వచ్చిన డబ్బంతా ఏం చేశారో ఎటు మళ్లించారో తెలియడం లేదని తెలిపారు.

Next Story