- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎన్డీఏ మరెన్నో విజయాలు సాధిస్తుంది.. ప్రధాని ట్వీట్‌కు సీఎం చంద్రబాబు రిప్లై
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు స్థానాలకు గాను రెండింట్లో ఎన్డీఏ కూటమి (NDA Alliance) అభ్యర్థులు ఘన విజయం సాధించారు.

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు స్థానాలకు గాను రెండింట్లో ఎన్డీఏ కూటమి (NDA Alliance) అభ్యర్థులు ఘన విజయం సాధించారు. ఈ నేపథ్యంలోనే కూటమి అభ్యర్థుల గెలుపుపై ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) సోషల్ మీడియా (Social Media) ఫ్లాట్ ఫాం ‘X’ (ట్విట్టర్) వేదికగా ట్వీట్ చేశారు. ‘విజయం సాధించిన ఎన్డీఏ (NDA) అభ్యర్థులకు అభినందనలు. కేంద్రంలోనూ, ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లోని ఎన్డీఏ ప్రభుత్వాలు ప్రజలకు సేవ చేస్తూనే ఉంటాయి. రాష్ట్ర అభివృద్ధి ప్రయాణాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్తాయి’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. అయితే, ప్రధాని చేసిన ట్వీట్‌కు సీఎం చంద్రబాబు (CM Chandrababu) రిప్లై ఇచ్చారు. ‘ప్రధాని నరేంద్ర మోడీ గారికి రాష్ట్రంలోని ఎన్డీఏ పక్షాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీ నేతృత్వంలో ఎన్డీఏ అటు దేశంలోనూ ఇటు రాష్ట్రంలో మరెన్నో విజయాలను సాధిస్తుందని నమ్ముతున్నా. ఎన్డీఏ పాలనలో అన్ని వర్గాల ప్రజల సర్వతోముఖాభివృద్ధి జరుగుతుందని ఆశిస్తున్నాను’ అంటూ ట్వీట్ చేశారు.
ఇక తెలంగాణ (Telangana)లో రూలింగ్‌లో ఉన్న కాంగ్రెస్ పార్టీ (Congress Party)ని కాదని ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ (BJP) ఏకంగా రెండు స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కాషాయ శ్రేణుల్లో పండుగ వాతావరణం నెలకొంది. బీజేపీ అభ్యర్థుల గెలుపు, పార్టీ కార్యకర్తలపై ప్రశంసల జల్లు కురిపిస్తూ ప్రధాని మోడీ చేసిన ట్వీట్ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ‘ఎమ్మెల్సీ ఎన్నికల్లో అద్వితీయమైన మద్దతును ఇచ్చి బీజేపీ (BJP)ని ఆశీర్వదించిన రాష్ట్ర ప్రజలకు నా కృతజ్ఞతలు. కొత్తగా ఎన్నికైన అభ్యర్థులకు నా అభినందనలు. నిత్యం ప్రజల మధ్యే ఉంటూ శ్రద్ధగా పనిచేస్తున్న మన పార్టీ కార్యకర్తలను చూసి నేను చాలా గర్వపడుతున్నా’ అని ట్వీట్ చేశారు. ప్రస్తుతం ప్రధాని చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.






