నేడు విశాఖలో చంద్రబాబు పర్యటన

by Ajay Maddhiboyina |

ఏపీ సీఎం చంద్ర‌బాబు నేడు విశాఖ జిల్లాలో ప‌ర్య‌టించనున్నారు. ఈ సంద‌ర్భంగా ఇండియన్ ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సదస్సు, గ్రీఫిన్ ఫౌండర్ నెట్‌వర్క్స్ మీటింగ్ లో ఆయ‌న పాల్గొంటారు.

నేడు విశాఖలో చంద్రబాబు పర్యటన
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ సీఎం చంద్ర‌బాబు నేడు విశాఖ జిల్లాలో ప‌ర్య‌టించనున్నారు. ఈ సంద‌ర్భంగా ఇండియన్ ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సదస్సు, గ్రీఫిన్ ఫౌండర్ నెట్‌వర్క్స్ మీటింగ్ లో ఆయ‌న పాల్గొంటారు. స‌మావేశం అనంత‌రం సాయంత్రం వైజాగ్ నుంచి కుప్పం ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌నున్నారు. రేపు కుప్పంలో హంద్రీనీవా సుజ‌ల స్ర‌వంతి కాలువ పై పైలాన్ ఆవిష్క‌రించ‌నున్నారు. అంతే కాకుండా హంద్రీనీవా జల హారతి కార్యక్రమంలో చంద్ర‌బాబు దంప‌తులు పాల్గొంటారు. కుప్పం ప‌ర్య‌ట‌న‌లో భాగంగా భారీ బ‌హిరంగ స‌భను సైతం ఏర్పాటు చేస్తున్నారు. మ‌ధ్యాహ్నం ప‌ర‌మ‌స‌ముద్రంలో బ‌హిరంగ స‌భ ఏర్పాటు చేయ‌గా సీఎం ప్ర‌సంగిస్తారు. ఈ స‌భా వేదిక‌గా ఐదు కంపెనీల‌తో ఎంఓయూ కుదుర్చుకుంటారు.

Next Story