మహిళలకు గుడ్ న్యూస్.. ఆర్టీసీలో ఉచిత ప్రయాణంపై CM చంద్రబాబు కీలక ప్రకటన

by Gantepaka Srikanth |

మహిళలకు ఆర్టీసీ(RTC) బస్సుల్లో ఉచిత ప్రయాణంపై ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu) సమీక్ష నిర్వహించారు.

మహిళలకు గుడ్ న్యూస్.. ఆర్టీసీలో ఉచిత ప్రయాణంపై CM చంద్రబాబు కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: మహిళలకు ఆర్టీసీ(RTC) బస్సుల్లో ఉచిత ప్రయాణంపై ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu) సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆగష్టు 15వ తేదీ నుంచి పథకం అమలు చేయాలని అధికారులను ఈ సందర్భంగా ఆదేశించారు. ఉచిత బస్సు పథకంలో జీరో ఫేర్ టికెట్‌ ఉంటుందని అన్నారు. రాయితీ వివరాలతో టికెట్లు జారీ చేయాలని చెప్పారు. ఏసీ ఎలక్ట్రానిక్ బస్సులు మాత్రమే కొనుగోలు చేయాలని ఈ సందర్భంగా ఆర్టీసీ యాజమాన్యానికి సూచనలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నట్లు తెలిపారు. గడిచిన ఐదేళ్ళ వైసీపీ పాలనలో కాలం చెల్లిన బస్సులు నడిపిందన్నారు. స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర భాగంగా ప్రయాణికులకు సౌకర్యం కల్పించడంలో కచ్చితమైన నిర్ణయాలను తీసుకున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని ప్రతీ జిల్లాలోని ప్రతీ బస్‌ స్టేషన్‌లో ఆర్వో వాటర్‌ప్లాం‌ట్‌లు ఏర్పాటు, ఫ్యాన్‌లు, బస్టాండ్‌ ఆవరణాలు పరిశుభ్రత, కుర్చీలు అందుబాటులోకి తీసుకొచ్చామని వెల్లడించారు.

Next Story