సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి 30 ఏళ్లు.. సోషల్ మీడియాలో ట్రెండింగ్

by Malleboina Mahesh |   (  Updated:2025-09-01 06:17:48  IST  )

సీఎంగా చంద్రబాబు నాయడు 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎక్స్ వేదికగా #30YearsSinceCBNbecameCM అనే హాష్ ట్యాగ్ ట్రెండింగ్ లో కొనసాగుతోంది.

సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి 30 ఏళ్లు.. సోషల్ మీడియాలో ట్రెండింగ్
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) తెలుగు రాజకీయాల్లో మరో మైలురాయిని అందుకున్నారు. చంద్రబాబు నాయుడు సరిగ్గా 30 సంవత్సరాల క్రితం ఇదే రోజు తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో ఆ శుభ పరిణామాన్ని మరోసారి గుర్తు చేసుకుంటు టీడీపీ నేతలు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. దీంతో ఎక్స్(ట్విట్టర్)లో #30YearsSinceCBNbecameCM అనే హాష్ ట్యాగ్ ప్రస్తుతం ట్రెండింగ్ లో కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఎంపీ బైరెడ్డి శబరి (MP Byreddy Sabari) ఎక్స్ వేదికగా ఆసక్తికర ట్వీట్ చేశారు.

ఆధునిక ఆంధ్రప్రదేశ్ నిర్మాత, అభివృద్ధి, దార్శనికత మరియు అంకితభావంతో రాష్ట్రాన్ని కొత్త దిశలో నడిపించిన దార్శనిక నాయకులు చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ముఖ్యమంత్రిగా మొదటిసారి ప్రమాణ స్వీకారం చేసి నేటికి 30 సంవత్సరాలు (30 years). ఈ సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన రాష్ట్ర పురోగతికి అంకితమైన మీ సేవలను ఎల్లప్పుడూ కృతజ్ఞతతో గుర్తుంచుకుంటాము" అని ఎంపీ శబరి తన ట్వీట్‌లో రాసుకొచ్చారు.

Next Story