- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బాధ్యతగా తీసుకున్నాం.. వెలుగులు నింపాం: సీఎం చంద్రబాబు
ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటను హామీగా కాకుండా బాధ్యతగా తీసుకున్నామని, నేడు చేనేత సోదరుల జీవితాల్లో వెలుగులు నింపామని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు....

దిశ, వెబ్ డెస్క్: ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటను హామీగా కాకుండా బాధ్యతగా తీసుకున్నామని, నేడు చేనేత సోదరుల జీవితాల్లో వెలుగులు నింపామని సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) అన్నారు. నెల్లూరు జిల్లా వింజమూరు(Vinjamoor)లో ఉచిత విద్యుత్(Free electricity) సరఫరా లబ్ధి ధృవపత్రాలను అందజేశారు. మగ్గం ఆడితేనే ఇంట్లో దీపం వెలిగే నేతన్నల కష్టాన్ని అర్థం చేసుకుని ఉచిత విద్యుత్ పథకానికి శ్రీకారం చుట్టామన్నారు. రూ.93 వేల చేనేత మగ్గాలకు నెలకు 200 యూనిట్లు, 11,488 మరమగ్గాలకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ ఈరోజు నుంచే అమలు చేస్తున్నామన్నారు. విద్యుత్‌ను రాయితీగానే కాదని, ఒక్కో నేతన్న కష్టానికి ఇస్తున్న గౌరవం... వారి వృత్తికి కలిగిస్తున్న భరోసా అని వ్యాఖ్యానించారు. ఏడాదికి రూ.150 కోట్లు ఖర్చవుతున్నా అంతకంటే ప్రభుత్వానికి ముఖ్యమైనది నేతన్నలు చిరునవ్వు అని వ్యాఖ్యానించారు. ఉచిత విద్యుత్ పథకం ద్వారా ఒక్కో కుటుంబానికి సంవత్సరానికి రూ.8 వేల నుంచి రూ.21 వేల దాకా ఆదా కలిగించడంతో పాటు వారి జీవన స్థాయిని మెరుగుపరచేందుకు వేసిన పెద్ద అడుగు అని తెలిపారు. చేనేత వస్త్రాలను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లేలా బ్రాండ్ కల్పిస్తూ అమ్మకాలను ప్రోత్సహిస్తున్నామన్నారు. ‘‘మగ్గం దగ్గర కూర్చుని జీవితాన్ని నెట్టుకొస్తున్న ప్రతీ నేతన్నకు ప్రభుత్వం చెబుతున్న మాట... మీరు నేస్తున్నది కేవలం వస్త్రం కాదు. మన సంస్కృతి. చేనేత కుటుంబాల అభ్యున్నతే లక్ష్యంగా వారి కష్టానికి తోడుగా నిలబడేందుకు ప్రజా ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుంది.’’ అని సీఎం చంద్రబాబు తెలిపారు.






