Chandrababu: జగన్ అరాచకాల నుంచి ప్రజలు బయటపడుతున్నారు

by Gantepaka Srikanth |

పులివెందుల(Pulivendula), ఒంటిమిట్ట(Vontimitta) జెడ్పీటీసీ ఉప ఎన్నికల ఫలితాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu) స్పందించారు.

Chandrababu: జగన్ అరాచకాల నుంచి ప్రజలు బయటపడుతున్నారు
X

దిశ, వెబ్‌డెస్క్: పులివెందుల(Pulivendula), ఒంటిమిట్ట(Vontimitta) జెడ్పీటీసీ ఉప ఎన్నికల ఫలితాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu) స్పందించారు. జగన్ అరాచకాల నుంచి ప్రజలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారని అన్నారు. పులివెందుల, ఒంటిమిట్టలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగాయని తెలిపారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిగాయి కాబట్టే.. ఒక్క పులివెందులలోనే 11 మంది నామినేషన్లు వేశారని చెప్పారు. జగన్‌లా నియంతృత్వం చేయాలనుకుంటే ఒక్కరు కూడా నామినేషన్ వేసి ఉండే వారు కాదని అన్నారు. పులివెందుల కౌంటింగ్‌‌లో ఓటర్ల స్లిప్పులు దొరికాయి.. 30 ఏళ్ల తర్వాత స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకున్నామని ఓటర్లు ఆనందంగా ఉన్నారని అన్నారు.

Next Story