- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నీత్ ఆయోగ్ సమావేశంలో ప్రజంటేషన్.. చంద్రబాబుపై పెద్ద ఎత్తున ప్రశంసలు
నీత్ ఆయోగ్ సమావేశంలో చంద్రబాబు ప్రజంటేషన్‌పై పెద్ద ఎత్తున ప్రశంసలు వెల్లవెత్తాయి..

దిశ, వెబ్ డెస్క్: దేశ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) ఢిల్లీ(Delhi)లో జరిగిన నీత్ ఆయోగ్ సమావేశం(NEET Aayog meeting)లో ప్రజంటేషన్ ఇచ్చారు. రెండులపాటు పర్యటనలో భాగంగా ఈ భేటీకి శనివారం ఆయన హాజరయ్యారు. ఈ సమావేశంలో వికసిత్ భారత్-2047, స్వర్ణాంధ్రపై నివేదిక ఇచ్చారు. ఇప్పటి వరకూ ఏన్డీయే కూటమి సాధించిన ప్రగతిని, దేశ, రాష్ట్రాభివృద్ధికి దోహదపడే అంశాలను ఆయన వివరించారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న కార్యక్రమాలను ఈ సమావేశంలో చంద్రబాబు ప్రస్తావించారు. 2.4 ట్రిలియన్ డాలర్ల ప్రగతిని సాధించే లక్ష్యంతో రాష్ట్రంలో ప్రణాళికలు రూపొందించనట్లు తెలిపారు. వికసిత్ భారత్ కల సాకారంతో స్వర్ణాంధ్రకు కృషి చేస్తున్నామని తెలిపారు.
రాష్ట్ర వనరులు, సద్వినియోగం చేసుకునే విధానంపైనా ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు ప్రజంటేషన్ ఇచ్చారు. ఇంటర్నేషనల్ స్థాయిలో విశాఖను అభిృవృద్ధి చేయనున్నట్లు తెలిపారు. అలాగే సిటీని నాలుగు జోన్లుగా ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు. విశాఖ మాదిరిగానే అమరావతి, తిరుపతి, కర్నూలు గ్లోబల్ మోడల్‌ను విస్తరించేలా కేంద్రప్రభుత్వం సహకరించాలని కోరారు. అయితే చంద్రబాబు ఇచ్చిన ప్రజెంటేషన్‌పై సమావేశానికి ప్రముఖులు పెద్ద ఎత్తున ప్రశంసించారు.






