Chanrababu : బీసీలకు పనిముట్లు అందజేసిన చంద్రబాబు నాయుడు

by Thanuru Gopichand |

ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం వడ్లమానులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు పర్యటించారు.

Chanrababu : బీసీలకు పనిముట్లు అందజేసిన చంద్రబాబు నాయుడు
X

దిశ డైనమిక్ బ్యూరో : ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం వడ్లమానులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu) ఈరోజు పర్యటించారు. కులవృత్తులు చేసుకునే వారి ఇళ్లకు ఆయన వెళ్లారు. కులవృత్తుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. బీసీ (BC) వర్గానికి చెందిన నక్కపోయిన కోట ఇంటికి సీఎం వెళ్లారు. కోటయ్య పశువుల పాకను పరిశీలించారు. గేదెల ద్వారా వచ్చే ఆదాయాన్ని అడిగి తెలుసుకున్నారు. బీసీ వర్గానికి చెందిన జగన్నాథం దుకాణాన్ని సీఎం పరిశీలించారు. బత్తుల జగన్నాథం ఆర్థిక పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆయనను ఆధ్యాత్మిక పనిముట్లతో కూడిన కిట్టును అందజేశారు. అనంతరం ప్రజావేదిక నిర్వహించారు. ప్రజలతో ముఖాముఖిగా మాట్లాడారు. మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆయన ఈరోజు పలు కార్యక్రమాలకు హాజరయ్యారు. అంతకుముందు జ్యోతిరావు పూలే (Pule) జయంతి సందర్భంగా ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. ' దేశానికి స్వాతంత్య్రం రావడానికి వందేళ్ల క్రితమే వర్ణ, కుల, లింగ వివక్షపై గళమెత్తి పోరాడి ప్రజలను చైతన్యపరచిన దార్శనికుడు మహాత్మ జ్యోతిరావు పూలే. ఆయన స్ఫూర్తితో బీసీల అభ్యున్నతికి ఆది నుంచీ కృషిచేస్తూ బీసీల పార్టీగా పేరుగాంచింది తెలుగుదేశం. ఈరోజు మహాత్మా పూలే జయంతి సందర్భంగా ఆ అభ్యుదయవాది సామాజిక, దేశ సేవలను స్మరించుకుందాం..' అని ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు

Next Story