7 రేక్‌ల యూరియా పంపండి: కేంద్రమంత్రికి చంద్రబాబు ఫోన్

by Vemula.Srinu Prasad |

యూరియా పంపాలని కేంద్రమంత్రికి చంద్రబాబు ఫోన్ చేశారు..

7 రేక్‌ల యూరియా పంపండి: కేంద్రమంత్రికి చంద్రబాబు ఫోన్
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో యూరియా కొరత మరింత తీవ్రతరం అయింది. యూరియా పంపిణీ కేంద్రాల వద్ద అన్నదాతలు అపసోపాలు పడుతున్నారు. అంత చేసి కౌంటర్ దగ్గరికి వెళ్లే సరికి నిరాశే మిగులుతోంది. డిమాండ్ తగ్గ యూరియ బస్తాలు ఇవ్వడం లేదు. గంటల కొద్ది క్యూలైన్ లో నిలబడితే వెళితే ఒక్క బస్తా మాత్రమే ఇస్తున్నారు. దీంతో తాము పంటలు ఎలా పండించాలని ప్రశ్నిస్తున్నారు. డిమాండ్ తగిన విధంగా యూరియా బస్తాలు ఇవ్వాలని కోరుతున్నారు.

ఈ నేపథ్యంలో యూరియా కొరతపై సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) దృష్టి పెట్టారు. ఆర్టీజీఎస్, తురకపాలెం ఆరోగ్య పరిస్థితి, యూరియా(Urea) సరఫరా, ఉల్లి కొనుగోళ్లపై సమీక్షించిన ఆయన కేంద్రమంత్రి జేపీ నడ్డా(Union Minister JP Nadda)కు ఫోన్ చేశారు. యూరియా సమస్య లేకుండా చూడాలని, ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)కు వెంటనే కేటాయించాలని కోరారు. కాకినాడకు వచ్చే షిప్‌లో 7 రేక్‌ల యూరియా రాష్ట్రానికి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

Next Story