- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్విట్జర్‌లాండ్‌లో కీలక సమావేశం.. జైలు ఘటనపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
జైలు ఘటనపై స్విట్జర్‌లాండ్‌లో చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు...

దిశ, వెబ్ డెస్క్: రాజకీయాల్లోకి వచ్చేలా యువతను ప్రోత్సహించామని సీఎం చంద్రబాబు నాయుడు(Ap Cm Chandrababu) అన్నారు. స్విట్జర్‌లాండ్ జ్యురిక్(Switzerland, Zurich)లో పారిశ్రామిక వేత్తల(Industrialists)తో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ యువత(Youth) వల్లే ఏ దేశమైనా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ఈ సమావేశానికి యూరప్(Europe)లోని 12 దేశాలు వచ్చాయన్నారు. అవకాశం వచ్చిన ప్రతి చోటకు భారతీయులు (Telugu People) వెళ్లిపోతున్నారని తెలిపారు. చాలా గొప్పగా పని చేసి ప్రపంచ దేశాల్లో తెలుగువాళ్లు కూడా రాణిస్తున్నారని చెప్పారు. పట్టుదలతో పని చేసి నైపుణ్యాన్ని పెంచుకుంటున్నారని పేర్కొన్నారు. అన్ని దేశాల్లో తెలుగు ప్రింట్ ఉండటం మన గొప్పతనం అని చంద్రబాబు తెలిపారు.
నేను జైలులో ఉన్నప్పుడు..
తాను జైలులో ఉన్నప్పుడు చాలా దేశాల్లో తెలుగువాళ్లు ధర్నాలు చేసి నిరసన తెలిపారని గుర్తు చేశారు. ఏపీ అసెంబ్లీలో ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం చాలా దేశాల్లో తెలుగువాళ్లు కృషి చేశారని పేర్కొన్నారు. దేవుడు మరో జన్మ ఇస్తే తెలుగువాడిగానే పుట్టాలని కోరుకుంటున్నానని చంద్రబాబు తెలిపారు. చదువుల విషయంలో అమ్మాయిల పట్ల వివక్ష వద్దని సూచించానని తెలిపారు. ఆ తర్వాత అమ్మాయిలో అన్ని రంగాల్లో అద్భుతంగా రాణిస్తున్నారన్నారు. ఇప్పుడు పురుషులకంటే అమ్మాయిలే ఎక్కువగా సంపాదిస్తున్నారని చంద్రబాబు చెప్పారు. ఈ జనరేషన్ పిల్లలను కనడానికి పెద్దగా ఆసక్తి చూపడంలేదన్నారు. సంపాదన ఒక్కటే ఉంటే సరిపోదని, పిల్లలు కూడా ఉండాలని సూచించారు. ప్రపంచదేశాల్లో తెలుగువాళ్లు మరింతగా రాణించాల్సిన అవసరం ఉందన్నారు. కర్మభూమి, జన్మభూమిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు వెళ్లాలని చంద్రబాబు పేర్కొన్నారు.






