- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Cm Chandrababu: వాస్తవిక పరిస్థితులపై ఫోకస్.. అధికారులకు సంచలన ఆదేశాలు
రాష్ట్రంలో వాస్తవిక పరిస్థితులపై అధికారులకు చంద్రబాబు సంచలన ఆదేశాలు జారీ చేశారు...

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం(Kutami Government) అధికారంలోకి వచ్చి ఆరు నెలలు విజయవంతంగా పూర్తి చేసుకుని ఏడాది వైపు వెళ్తున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు(Cm Chandrababu) వాస్తవిక పరిస్థితులపై ఫోకస్ పెట్టారు. వివిధ పథకాలు అమలు చేస్తున్నప్పటికీ ప్రజల స్పందన ఏ విధంగా ఉందనేదానిపై ఆయన ఆరా తీశారు. ఐవీఆర్(IVR)తో పాటు వివిధ రూపాల్లో లబ్ధిదారుల అభిప్రాయాన్ని సేకరించారు. ఫించన్లు, దీపం పథకం, అన్న క్యాంటీన్లు, ఇసుక సరఫరా, ప్రభుత్వం పాలసీలపై ఇప్పటికే ప్రజల అభిప్రాయాన్ని సేకరించారు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ సిబ్బంది, ఉద్యోగులు, అధికారుల పని తీరుపైనా ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు.
ఈ మేరకు అమరావతి సచివాలయం(Amaravati Secretariat)లో అధికారులతో తాజాగా చంద్రబాబు సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాల అమలు, ప్రజల నుంచి సేకరించిన అభిప్రాయాలపై సమీక్సించారు. అధికారులకు ప్రజంటేషన్ ఇచ్చారు. ప్రజల సంతృప్తి అంశంలో సంచలన ఆదేశాలు జారీ చేశారు. గ్రామ స్థాయి వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వం ముందుకెళ్తోందని, అధికారులు కూడా అలాగే పని చేయాలన్నారు. ‘ప్రజలే ఫస్ట్’ అనే విధానంలో పని చేయాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు.






