చంద్రబాబు రాజకీయ నాయకుడు కాదు.. జనసేన ఎమ్మెల్సీ నాగబాబు సంచలన వీడియో

by Ramesh Goud |   (  Updated:2025-04-20 10:51:28  IST  )

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) పుట్టిన రోజు (Birthday) సందర్భంగా ప్రధాని మోడీ సహా రాజకీయ నాయకులు, పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు.

చంద్రబాబు రాజకీయ నాయకుడు కాదు.. జనసేన ఎమ్మెల్సీ నాగబాబు సంచలన వీడియో
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) పుట్టిన రోజు (Birthday) సందర్భంగా ప్రధాని మోడీ సహా రాజకీయ నాయకులు, పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు. భాష్యం విధ్యాసంస్థల అధినేత రామకృష్ణ టీటీడీ (TTD)కి ఒక రోజు అన్న ప్రసాద వితరణకు రూ.44 లక్షలను అందజేశారు. ఈ క్రమంలోనే జనసేన ఎమ్మెల్సీ కొణిదల నాగబాబు (MLC Konidala Nagababu) చంద్రబాబు నాయుడు ఉద్దేశించి ఆసక్తికర వీడియో విడుదల చేశారు.

చంద్రబాబు రాజకీయ నాయకుడు (Politician) కాదని, రాజనీతిజ్ఞుడు (Statesmen) అని ఆయన కొనియాడారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ.. చంద్రబాబుకు చాలా ఓపిక ఉంటుందని, ఎన్నో అవమానాలు బరించారని తెలిపారు. అసెంబ్లీలోనే ఇది శాసన సభ కాదు, కౌరవ సభ అంటూ.. మళ్లీ సీఎం అయ్యాకే అసెంబ్లీలో అడుగు పెడతానని చెప్పి, సీఎం అయ్యాకే అడుగు పెట్టారని అన్నారు. ఆయనను గొప్ప రాజకీయ నాయుకుడు అంటే తాను ఒప్పుకోనని, గొప్ప రాజనీతిజ్ఞుడు అని వ్యాఖ్యానించారు.

అలాగే నారావారిపల్లె నుండి ఒక సాధారణ కార్యకర్తగా ప్రయాణం ప్రారంభించి 28 ఏళ్లకే శాసన సభ్యునిగా ఎన్నికై, 30 ఏళ్లకు మంత్రిగా మెప్పించారని తెలిపారు. నాలుగున్నర దశాబ్దాల నుంచి అలుపెరగని ప్రజాప్రతినిధిగా ప్రజా జీవితానికే తన జీవితాన్ని అంకితమిచ్చిన నారా చంద్రబాబు నాయుడు కి 75 వ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. దూరదృష్టి అనే పదానికి నిలువెత్తు నిదర్శనం చంద్రబాబు నాయుడు అంటూ.. ఆయన సంపూర్ణ ఆరోగ్యం, సుదీర్ఘ ఆయుషుతో ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని ఆశిస్తున్నానని నాగబాబు అన్నారు.

Next Story