YS Sharmila : బీజేపీతో తెరముందు చంద్రబాబు..తెరవెనుక జగన్ పొత్తులు : వైఎస్.షర్మిల

by Y. Venkata Narasimha Reddy |   (  Updated:2025-01-26 07:52:01  IST  )

బీజేపీ(BJP)తో సీఎం చంద్రబాబు(Chandrababu)తెరముందు పొత్తు. జగన్(Jagan)తెరవెనుక పొత్తులు(Alliances)పెట్టుకుని ఆ పార్టీకి గులాంగిరీ చేశారని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వై.ఎస్.షర్మిల(AP Congress Chief Y.S. Sharmila) విమర్శించారు.

YS Sharmila : బీజేపీతో తెరముందు చంద్రబాబు..తెరవెనుక జగన్ పొత్తులు : వైఎస్.షర్మిల
X

దిశ, వెడ్ డెస్క్ : బీజేపీ(BJP)తో సీఎం చంద్రబాబు(Chandrababu)తెరముందు పొత్తు. జగన్(Jagan)తెరవెనుక పొత్తులు(Alliances)పెట్టుకుని ఆ పార్టీకి గులాంగిరీ చేశారని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వై.ఎస్.షర్మిల(AP Congress Chief Y.S. Sharmila) విమర్శించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా విజయవాడ ఆంధ్రరత్న భవన్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో జాతీయ జెండాను ఎగురవేసి మాట్లాడారు. పార్లమెంట్ వేదికగా అంబేద్కర్ ను అవమానిస్తే టీడీపీ, వైసీపీలు బీజేపీతో జత కట్టి అన్యాయానికి వత్తాసు పలుకుతున్నాయని మండిపడ్డారు.

విభజన హామీలపై బీజేపీ మోసం చేసినా పోటీ పడి టీడీపీ, వైసీసీ, జనసేనలు పొత్తులు పెట్టుకుంటున్నాయన్నారు. జగన్ వైఎస్ఆర్ ఆశయాలను తుంగలో తొక్కారని.. వైసీపీకి దళితులు ఓట్లు వేసి గెలిపిస్తే వారి పట్ల కృతజ్ఞత భావం లేదన్నారు. దళితులను అవమానిస్తుంటే కనీసం చిన్న ఖండన కూడా లేదని..అంబేద్కర్ విగ్రహాలు పెడితే గౌరవం ఉన్నట్లు కాదని.. అంబేద్కర్ కి అవమానం జరిగితే వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఒక్క మాట కూడా మాట్లాడలేదని షర్మిల విమర్శించారు. ఏడు దశాబ్దాల క్రితం ఇదే రోజు మన రాజ్యాంగం అమల్లోకి వచ్చిందని..మన దేశం ఒక స్వయం పరిపాలిత దేశంగా మారింది.

మన దేశం విభిన్న సంస్కృతితో కూడిన నిలయం. భిన్నత్వంలో ఏకత్వం మన నినాదం.. మనకున్న ఈ హక్కులు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం కల్పించినవేనని గుర్తు చేశారు. బీజేపీకి ఇవ్వాళ రాజ్యాంగం అంటే గౌరవం లేదని..స్వాతంత్ర్య సమరయోధులను సైతం అవమానిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబేద్కర్ ను హేళన చేస్తున్నారని..మహాత్మ గాంధీని విలన్ గా చూపిస్తున్నారని..మహాత్మ గాంధీని చంపిన గాడ్సేకి గుడులు కడుతున్నారని, మతం,కులం పేరుతో కలహాలు రేపుతున్నారని విమర్శించారు.

దేశ సంపదను ప్రధాని మోడీ తన దోస్తులకు దోచిపెడుతున్నారని..ప్రభుత్వ సంస్థలను గుప్పిట్లో పెట్టుకొని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీతో దేశానికి, రాజ్యాంగానికి ప్రమాదం పొంచి ఉందని..బీజేపీ అధికారంలో ఉంటే రాజ్యాంగాన్ని మార్చుతుందని.. రిజర్వేషన్లు ఎత్తేస్తుందని.. మతాల మధ్య, కులాల మధ్య చిచ్చు పెడుతుందని..ఈ దేశానికి మేలు చేసేది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని షర్మిల చెప్పుకొచ్చారు.

Next Story