ఏపీ హైకోర్టులో చంద్రబాబు హౌస్ మోషన్ పిటిషన్

by Seetharam |   (  Updated:2023-10-26 06:23:18  IST  )

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు.

ఏపీ హైకోర్టులో చంద్రబాబు హౌస్ మోషన్ పిటిషన్
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. గురువారం హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. స్కిల్ స్కాం కేసులో రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబు నాయుడు బెయిల్ పిటిషన్‌పై అత్యవసర విచారణ జరిపించాలని కోరారు. చంద్రబాబు నాయుడు కంటి సమస్యతో బాధపడుతున్నారని న్యాయవాదులు పిటిషన్‌లో పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు మూడు నెలల క్రితం ఎడమ కంటికి కాటరాక్ట్ ఆపరేషన్ చేయించుకున్నారని తెలిపారు. అయితే ఇప్పుడు కుడికంటికి కాటరాక్ట్ ఆపరేషన్ చేయించుకోవాల్సి ఉందని తెలిపారు. ఇప్పటికే చంద్రబాబు నాయుడు కంటి సమస్యతో బాధపడుతున్న నేపథ్యంలో అత్యవసరంగా బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపించాలని చంద్రబాబు తరఫు న్యాయవాది పిటిషన్‌లో పేర్కొన్నారు.

Next Story