- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Chandrababu హౌస్ కస్టడీపై విచారణ 10 నిమిషాల వాయిదా
డీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు రిమాండ్‌ను హౌస్ కస్టడీపై వాదనలు కొనసాగుతున్నాయి...

దిశ, వెబ్ డెస్క్: టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు రిమాండ్‌ను హౌస్ కస్టడీపై వాదనలు కొనసాగుతున్నాయి. చంద్రబాబు తరఫున లాయర్ సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపిస్తున్నారు. రిమాండ్ లు ఉన్న చంద్రబాబుకు ప్రాణ హాని ఉందని, జెడ్+ కేటగిరి భద్రతలో ఆయన ఉన్నారని కోర్టుకు దృష్టికి లూథ్రా తీసుకెళ్లారు. గతంలో ఇలాంటి కేసులో సుప్రీంకోర్టు తీర్పును కోర్టుకు వివరించారు. ఇప్పటికే రెండు సార్లు వాదనలు జరిగాయి. మరోవైపు రిమాండ్‌ను హౌస్ కస్టడీగా మార్చాల్సిన అవసరం లేదని సీఐడీ తరఫు న్యాయవాది సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. దీంతో విచారణకు జడ్జి 10 నిమిషాలు బ్రేక్ ఇచ్చారు. ఇప్పటికే ఇరువర్గాల వాదనలు విన్న ఏసీబీ కోర్టు.. పది నిమిషాల తర్వాత ఎలాంటి తీర్పు ఇస్తుందోనన్న ఉఠ్కంత నెలకొంది.
కాగా మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు తరఫు న్యాయవాదులపై ఏసీబీ కోర్టు సీరియస్ అయింది. వరుసగా పిటిషన్లు వేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలా వెంట వెంటనే పిటిషన్లు దాఖలు చేస్తే తాము విధులు ఎలా నిర్వహించాలని మండిపడ్డింది. కోర్టు రూల్స్‌ను పాటించాలని జడ్జి ఆదేశించారు. మధ్యాహ్నం 12 గంటల లోపే పిటిషన్లు వేయాలని సూచించారు. డైరెక్ట్‌గా పిటిషన్లు దాఖలు చేసి వాదనలు వినమంటే ఎలా ప్రశ్నించారు.
అంతకుముందు ఏసీబీ కోర్టులో చంద్రబాబు తరపున మరో పిటిషన్ దాఖలైంది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసుకు సంబంధించి డాక్యుమెంట్లు పరిశీలించేందుకు అనుమతి ఇవ్వాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. సెక్షన్ 207 సీఆర్పీసీ కింద అనుమతి ఇవ్వాలని లాయర్ కోరారు.






