Chandrababu కావాలనే నన్ను టార్గెట్ చేశారు: Peddireddy Ramachandra Reddy

by Chukka Sudharani |   (  Updated:2023-01-07 09:11:56  IST  )

రాజకీయాల్లో ఎంత మంచి చేసినా, చెడుగా చిత్రీకరించి విమర్శించే వారు చాలా మంది ఉంటారు.

Chandrababu కావాలనే నన్ను టార్గెట్ చేశారు: Peddireddy Ramachandra Reddy
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాజకీయాల్లో ఎంత మంచి చేసినా, చెడుగా చిత్రీకరించి విమర్శించే వారు చాలా మంది ఉంటారు. చంద్రబాబు మనల్ని కావాలని టార్గెట్ చేస్తున్నారు. మనకు ఏం సంబంధం లేకపోయినా మనపై విమర్శలు చేస్తున్నారు అని రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. శనివారం పుంగనూరు నియోజకవర్గం సోమల మండలంలో పల్లెబాట కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబు తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కుప్పం పర్యటనలో భాగంగా చంద్రబాబు తమపై దుష్ప్రచారం చేస్తూనే ఉన్నారని విమర్శించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రశాంతంగా ఉంటే అక్కడకు వచ్చి అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని అంతేకాదు రెచ్చగొట్టేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు.

ముఖ్యమంత్రి వైస్ జగన్ అద్భుతమైన పాలన అందిస్తున్నారని చెప్పుకొచ్చారు. పేదరికం చూసి అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నట్లు వెల్లడించారు.వచ్చే ఎన్నికల్లో మనమంతా జగన్ మోహన్ రెడ్డికి అండగా ఉండాలని కోరారు. 1978 నుండి నాకు మద్దతు ఇచ్చిన నాయకులు ఈ ప్రాంతంలో ఉన్నారు. గతంలో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోలేకపోయాం. జగన్ మోహన్ రెడ్డి పుంగనూరును సొంత నియోజకవర్గంగా భావించి అభివృద్ధి చేస్తున్నారు. 40 ఏళ్లలో చేయలేని అభివృద్ధి ఈ మూడు సంవత్సరాల్లో చేశాం. ప్రతి గ్రామంలో ఓవర్ హెడ్ ట్యాంకులు ఏర్పాటు చేస్తున్నాం, త్వరలోనే ఇంటింటికీ కుళాయి ద్వారా నీరు అందిస్తాం. ఆవులపల్లి ప్రాజెక్ట్ నిర్మాణం సాగుతుంది. ఇకపై త్రాగు, సాగు నీరుకి ఎటువంటి ఇబ్బందీ ఉండదు అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హామీ ఇచ్చారు.

Read More...

'ఇంకెన్నాళ్లు నన్ను రహస్యంగా ఉంచుతావ్ నాన్న.. నీ కొడుకుగా పరిచయం చేయు'

Next Story