పోలవరం - బనకచర్లపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదు : అంబటి రాంబాబు

by Muthe.Rajitha |   (  Updated:2025-07-17 12:20:05  IST  )

వైఎస్ఆర్‌సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu) చంద్రబాబుపై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేసారు.

పోలవరం - బనకచర్లపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదు : అంబటి రాంబాబు
X

దిశ, వెబ్ డెస్క్ : వైఎస్ఆర్‌సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu) చంద్రబాబుపై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేసారు. పోలవరం(POLAVARAM)పై చంద్రబాబుకు అసలు చిత్తశుద్ధి లేదన్నారు. 2024లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu), తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్య జరిగిన భేటీలో చర్చించిన అంశాలపై ఇంతవరకు అతీగతీ లేదని మండిపడ్డారు. అపుడు పునర్విభజన చట్టం(2014)లోని విభజన సమస్యలను పరిష్కరించేందుకు కమిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారని, ఏడాది గడిచినా దానిపై ఎటువంటి పురోగతి లేదని అన్నారు. ఇక నిన్న జరిగిన భేటీలో కృష్ణా, గోదావరి నదుల జల వాటాలు, పోలవరం, బనకచర్ల ప్రాజెక్టులపై చర్చలు జరగలేదని విమర్శించారు.

చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని, డయాఫ్రం వాల్ నిర్మాణం 2025 డిసెంబర్ నాటికి పూర్తవుతుందని గొప్పగా చెప్పారని... వాస్తవానికి పోలవరం పనులు నత్తనడకలాగ సాగుతున్నాయని వివరించారు. పోలవరం ఎత్తును 42 మీటర్ల ఎత్తు తగ్గింపుతో బనకచర్ల సాంకేతికంగా సాధ్యమవుతుందా అని ప్రశ్నించారు. వైఎస్ఆర్‌సీపీ ఈ ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదని, కానీ గోదావరి జల వివాద ట్రిబ్యునల్ అవార్డు (1980)ను ఉల్లంఘించకుండా సాంకేతిక, చట్టపరమైన సమస్యలను పరిష్కరించాలని అంబటి డిమాండ్ చేశారు.

Next Story