Chandrababu Naidu : కులగణన నిర్ణయంపై చంద్రబాబు హర్షం

by Muthe.Rajitha |   (  Updated:2025-04-30 16:02:35  IST  )

దేశంలో జనాభా లెక్కల(Census)తోపాటు కులగణన(Cast Census) చేపట్టాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu Niadu) హర్షం వ్యక్తం చేశారు.

Chandrababu Naidu : కులగణన నిర్ణయంపై చంద్రబాబు హర్షం
X

దిశ, వెబ్ డెస్క్ : దేశంలో జనాభా లెక్కల(Census)తోపాటు కులగణన(Cast Census) చేపట్టాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu Niadu) హర్షం వ్యక్తం చేశారు. కులగణనపై కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని తెలిపిన చంద్రబాబు.. ఈ నిర్ణయం ప్రధాని నరేంద్ర మోడీ(PM Narendra Modi) నిబద్ధతకు నిర్వచనం అన్నారు. కేంద్రం చేపట్టబోయే కులగణన బడుగు బలహీన వర్గాల అవసరాలు తీరుస్తుందని తెలియజేశారు. దీనివల్ల సామాజిక న్యాయం దక్కుతుందని, బడుగువర్గాల ఆర్థికంగా బలోపేతం కావడానికి ఈ నిర్ణయం దోహాపడుతుందని పేర్కొన్నారు. ఈ మేరకు చంద్రబాబు నాయుడు తన ఎక్స్ ఖాతా వేదికగా పోస్ట్ చేశారు.

Next Story