- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రశాంత్ కిషోర్‌ను మేం వాడి వదిలేశాం.. చంద్రబాబూ! : మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ భేటీపై రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ భేటీపై రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారుకలిసిన సంగతి తెలిసిందే. చంద్రబాబుకు ఎన్నికల భయం పట్టుకుందని ఈ భేటీతో అర్థమైందని అన్నారు. ప్రశాంత్ కిశోర్‌ను గతంలో తాము వాడుకుని వదిలేశామని చెప్పుకొచ్చారు. తాడు వాడి వదిలేసిన ప్రశాంత్ కిషోర్‌ను చంద్రబాబు ఇప్పుడు పట్టుకుని తెచ్చుకున్నారని అన్నారు. రాష్ట్రంలో ఏ ఒక్కరు కూడా చంద్రబాబును నమ్మే స్థితిలో లేరని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో టీడీపీ పరిస్థితి దారుణంగా ఉందని.. ప్రశాంత్ కిషోర్ కూడా ఏమీ చేయలేరని చెప్పుకొచ్చారు. మరోవైపు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో చంద్రబాబు వైసీపీపైనా, వైసీపీ ప్రభుత్వంపైనా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు చేస్తున్న తప్పుడు ప్రచారాలకు ఎల్లో మీడియా అండగా ఉందని చెప్పుకొచ్చారు. చంద్రబాబు నాయుడు ఎన్ని కుట్రలు చేసినా.. ఎంతమందితో కలిసి వచ్చినా గెలిచేది మాత్రం వైసీపీయేనని చెప్పుకొచ్చారు. గతంలో కంటే అత్యధిక స్థానాల్లో వైసీపీ గెలుపొందుతుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధీమా వ్యక్తం చేశారు.






