బొజ్జల దెబ్బకు చంద్రబాబు బెంబేలు!

by Dishafeatures2 |
బొజ్జల దెబ్బకు చంద్రబాబు బెంబేలు!
X

దిశ, తిరుపతి: అస‌మ్మతి స్వరాల‌తో వ‌ణికిపోతున్న చంద్రబాబుకు, సొంత జిల్లాలో కూడా అదే ప‌రిస్థితి ఎదురుకావ‌డంతో వెన‌క్కి త‌గ్గారు. తిరుప‌తి జిల్లా శ్రీ‌కాళ‌హ‌స్తి టీడీపీ ఇన్‌చార్జ్ బొజ్జ‌ల సుధీర్‌రెడ్డితో దెబ్బతో చంద్రబాబు బెంబేలెత్తారు. ఆ నియోజ‌క‌వ‌ర్గ వైసీపీ నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు ఇవాళ టీడీపీలో చేరిక‌ను నిలిపేయాల్సిన ప‌రిస్థితి ఏర్పడింది. బొజ్జల సుధీర్‌రెడ్డి విడుద‌ల చేసిన ఒకే ఒక్క వాయిస్ మెసేజ్‌తో బాబు భ‌య‌ప‌డ్డారు.

త‌న‌కు ఎలాంటి స‌మాచారం లేకుండానే ఎస్సీవీనాయుడిని పార్టీలో చేర్చుకుంటున్నార‌ని, ఈ కార్యక్రమానికి ఎవ‌రూ వెళ్లొద్దంటూ బొజ్జల ఆదేశాలు ఇచ్చారు. దీంతో రాత్రికే రాత్రి చంద్రబాబు నిర్ణయాన్ని మార్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఎస్సీవీ నాయుడి చేరిక‌ను తాత్కాలికంగా నిలిపేశారు. ఈ నెల 14న కుప్పానికి రావాల్సిందిగా బొజ్జల సుధీర్‌, ఎస్సీవీ నాయుడిని టీడీపీ అధిష్టానం ఆదేశించ‌డం చ‌ర్చకు తెర‌లేచింది. బొజ్జల సుధీర్ ఆగ్రహించక‌పోతే ఇవాళ ఎస్సీవీ నాయుడి చేరిక జ‌రిగిపోయేద‌నే టాక్ వినిపిస్తోంది.

Next Story

Most Viewed