- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మూడో బిడ్డ పుడితే రూ.30వేలు, నాలుగో బిడ్డ పుడితే రూ.40వేలు.. సీఎం చంద్రబాబు బంపరాఫర్
రాష్ట్రంలో జనాభా తగ్గుదలపై మరోసారి సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జనాభా తగ్గుదల సమస్యగా మారిందని అన్నారు. జనాభా తగ్గితే ఆర్థిక వ్యవస్థపై భారం పడుతుందని చెప్పారు.

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో జనాభా తగ్గుదలపై మరోసారి సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జనాభా తగ్గుదల సమస్యగా మారిందని అన్నారు. జనాభా తగ్గితే ఆర్థిక వ్యవస్థపై భారం పడుతుందని చెప్పారు. జనాభా పెరుగుదలకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుందని అన్నారు. పిల్లలు భారం కాదని వాళ్లే సంపద అని వ్యాఖ్యానించారు. మూడో బిడ్డ పుట్టిన వెంటనే ఆ దంపతులకు రూ.30వేలు ఇస్తామని ప్రకటించారు. నాలుగో బిడ్డ పుట్టిన వెంటనే రూ.40వేలు ఇస్తామని అన్నారు. అంతే కాకుండా రాష్ట్రం మొత్తం పరిశుభ్రంగా ఉండాలని ఈరోజు స్వచ్ఛాంధ్ర ప్రారంభిస్తున్నామని తెలిపారు. స్వర్ణాంధ్ర దిశగా అడుగులు వేస్తున్నామని, ఒకటో తారీఖు వచ్చిందంటే ఎక్కడ ఉన్నా ఆ రోజు మీ దగ్గరకు వచ్చి నేరుగా పింఛన్లు ఇవ్వడంలో ఎంతో ఆనందం ఉంటుందని చెప్పారు. అధికార యంత్రాంగం, టీడీపీ కుటుంబం తనకు ఉన్న రెండు టీమ్స్ అని అన్నారు. తనకు మంచి పేరు వచ్చినా, చెడు పేరు వచ్చినా అధికార యంత్రాంగం వల్లే వస్తుందన్నారు. అనునిత్యం కంటికి రెప్పల్లా కాపాడుకునే టీడీపీ కుటుంబాన్ని, జీవితంలో మర్చిపోలేనని అన్నారు.






