శ్రీవారి ఆశీస్సులతో చంద్రబాబు బయటకొస్తారు : దర్శకుడు కే రాఘవేంద్రరావు

by Disha Web Desk 21 |
శ్రీవారి ఆశీస్సులతో చంద్రబాబు బయటకొస్తారు : దర్శకుడు కే రాఘవేంద్రరావు
X

దిశ, డైనమిక్ బ్యూరో : స్కిల్ స్కామ్ కేసులో అరెస్టై రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు నాయుడుకు మద్దతు వెల్లువెత్తుతుంది. రాజకీయ, సినీ ప్రముఖులు తమ సంఘీభావం ప్రకటించారు. ఇప్పటికే ప్రముఖ సినీ నిర్మాత అశ్వనీదత్, నట్టికుమార్, సూపర్ స్టార్ రజినీకాంత్‌లు స్పందించారు. చంద్రబాబు నాయుడు పోరాట మోధుడు అని ఆయనను అక్రమ కేసులు ఏమీ చేయలేదని అన్నారు. తాజాగా ప్రముఖ దర్శకుడు కే రాఘవేంద్రరావు స్పందించారు. ‘శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కృపా కటాక్షాలతో అలిపిరి బాంబ్ బ్లాస్ట్ నుంచి ఆనాడు నారా చంద్రబాబు నాయుడు క్షేమంగా ఎలా అయితే బ్రతికి బయట పడ్డారో ఇప్పుడు కూడా ఆ స్వామి వారి ఆశీస్సులతోనే ఎలాంటి బ్లాక్ మార్క్ లేకుండా జైలు నుంచి తప్పకుండ బయటకు వస్తారు’ అని దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు ఆశాభావం వ్యక్తం చేశారు.



Next Story

Most Viewed