- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయండి...ఎస్పీలకు చంద్రబాబు దిశానిర్దేశం
సీఎం చంద్రబాబు 26 జిల్లాల ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో వారికిి దిశానిర్దేశం చేశారు. సోషల్ మీడియా సైకోలను కట్టిడి చేయాలని ఆదేశించారు.

దిశ, వెబ్ డెస్క్: సీఎం చంద్రబాబు 26 జిల్లాల ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో వారికిి దిశానిర్దేశం చేశారు. సోషల్ మీడియా సైకోలను కట్టిడి చేయాలని ఆదేశించారు. రాజకీయ ముసుగులో చేసే నేరాలను ఉపేక్షించవద్దని సూచించారు. వివేక హత్య, సింగయ్య మృతి కేస్ స్టడీలుగా చూడాలని తెలిపారు. ఇన్వెస్టిగేషన్ లో టెక్నాలజీ వినియోగంతో మంచి ఫలితాలు వస్తాయని అన్నారు.
రియాక్ట్, రీచ్, రెస్పాండ్, రిజల్ట్ విధానం పాటించాలని తెలిపారు. ప్రజలతో స్నేహంగా ఉంటూనే అసాంఘీక శక్తులు భయపడేలా పనిచేయాలన్నారు. ఈ సమావేశం తరవాత మంత్రులు, సెక్రటరీలతో సమావేశం అయ్యారు. 15, 16 తేదీల్లో జరిగే కలెక్టర్ల కాన్ఫరెన్స్ గురించి చర్చించారు. మంత్రులు మరింత సమర్దవంతంగా పనిచేయాలని సూచించారు. సమస్యలను సవాళ్లను దాటి అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. అంతే కాకుండా పాలనలో వేగం పెంచాలని ఉన్నతాధికారులు, మంత్రులకు సూచించారు.






