- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టీడీపీకి కార్యకర్తలే బ్రాండ్: చంద్రబాబు
పనులు చేయడం ఎంత ముఖ్యమో చేసిన పనులను చెప్పుకోవడం కూడా అంతే ముఖ్యమని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు.

X
దిశ, వెబ్ డెస్క్: పనులు చేయడం ఎంత ముఖ్యమో చేసిన పనులను చెప్పుకోవడం కూడా అంతే ముఖ్యమని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. కుప్పంలో కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. అభివృద్ధికి టీడీపీ బ్రాండ్ అయితే..పార్టీకి కార్యకర్తలే బ్రాండ్ అని వ్యాఖ్యానించారు. నేతలు అటూ ఇటూ మారతారని కానీ కార్యకర్తలే శాశ్వతం అని చెప్పారు. అభివృద్ధి, సంక్షేమం అంతా కర్యకర్త ద్వారానే జరగాలని అన్నారు. ఇదిలా ఉంటే చంద్రబాబు రెండు రోజుల కుప్పం పర్యటనలో అనేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కార్యకర్తల సమావేశానికి ముందు ఆయన మామిడి రైతులతో భేటీ అయ్యారు. రైతులతో పాటు ఉధ్యానవన అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అంతే కాకుండా కుప్పం ఏరియా ఆస్పత్రిలోని డిజిటల్ నెర్స్ సెంటర్‌ను, నియోజకవర్గంలోని 13 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో అనుసంధాన్ని ఆవిష్కరించారు.
Next Story






