- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హిందీపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
by Ajay Maddhiboyina |
హిందీ భాష నేర్చుకోవడంపై సీఎం చంద్రబాబు మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో నిర్వహించిన లెక్చర్ అండ్ సిరీస్ ఆరో ఎడిషన్ కార్యక్రమంలో లైఫ్ అండ్ లెగసీ ఆఫ్ పీవీ అంశంపై చంద్రబాబు మాట్లాడారు.

X
దిశ, వెబ్ డెస్క్: c ఉమ్మడి ఏపీ అభివృద్ధిలో పీవీ పాత్ర ఎంతో ఉందని కొనియాడారు. 17 భాషలు నేర్చుకున్న పీవీ నరసింహారావు సీఎంగా, ప్రధానిగా, కేంద్రమంత్రిగా సేవలు అందించారన్నారు. హిందీ నేర్చుకోవాలంటే మనం హిందీ ఎందుకు నేర్చుకోవాలని అడుగుతున్నారని, కానీ పీవీ నరసింహారావు 17 భాషలు నేర్చుకున్నాడని అన్నారు.
అందుకే అంత గొప్ప వ్యక్తిగా ఎదిగాడని చెప్పారు. దేశానికి అనేకరంగాల్లో పీసీ సేవలు అందించారని, ఆర్థిక సంస్కరణలు అంటే ఆయన పేరే గుర్తుకు వస్తుందని అన్నారు. ఇదిలా ఉంటే సీఎం చంద్రబాబు హిందీ గురించి ప్రస్తావించడం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే కూటమి నేత పవన్ కల్యాణ్ హిందీని పెద్దమ్మ అని సంభోదిస్తూ కామెంట్లు చేయగా విమర్శలు వస్తున్నాయి. హిందీని మాపై రుద్దొద్దు అంటూ పలువురు మేధావులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Next Story






