మహిళలకు షాక్.. ఫ్రీబస్ జిల్లాకే పరిమితం

by Ajay Maddhiboyina |

ఏపీలో ఫ్రీ బ‌స్ ప‌థ‌కంపై సీఎం చంద్ర‌బాబు క్లారిటీ ఇచ్చారు. ఉచిత బ‌స్సు ప‌థ‌కం జిల్లాకే ప‌రిమితం అని స్ప‌ష్టం చేశారు. అంతే కాకుండా ఆగ‌స్టు 15 నుండి రాష్ట్రంలో ఉచిత బ‌స్సు ప్ర‌యాణం అమ‌లవుతుంద‌ని

మహిళలకు షాక్.. ఫ్రీబస్ జిల్లాకే పరిమితం
X

దిశ‌, వెబ్ డెస్క్: ఏపీలో ఫ్రీ బ‌స్ ప‌థ‌కంపై సీఎం చంద్ర‌బాబు క్లారిటీ ఇచ్చారు. ఉచిత బ‌స్సు ప‌థ‌కం జిల్లాకే ప‌రిమితం అని స్ప‌ష్టం చేశారు. అంతే కాకుండా ఆగ‌స్టు 15 నుండి రాష్ట్రంలో ఉచిత బ‌స్సు ప్ర‌యాణం అమ‌లవుతుంద‌ని చెప్పారు. ఏ జిల్లాకు చెందిన మ‌హిళ‌లు ఆ జిల్లాలోనే ప్ర‌యాణించేలా ష‌ర‌తులు వ‌ర్తిస్తాయ‌ని అన్నారు. శ్రీశైలంలో ప‌ర్య‌టిస్తున్న సంద‌ర్భంగా చంద్ర‌బాబు ఈ వ్యాఖ్య‌లు చేశారు. అంతే కాకుండా పోలవ‌రం ఏపీకి పెద్ద వ‌రం అని అన్నారు. ప్ర‌తి ఏడాది 2వేల టీఎంసీలు స‌ముద్రంలోకి వెళుతున్నాయ‌ని చెప్పారు.

ఏపీ 200 టీఎంసీలు, తెలంగాణ 200 టీఎంసీల నీటిని వాడుకోవ‌చ్చ‌న్నారు. రాయ‌లసీమ ఒక‌ప్పుడు రాళ్ల‌సీమ అని కానీ ఇప్పుడు కాద‌న్నారు. రాయ‌ల‌సీమ అభివృద్ధికి త‌న వ‌ద్ద బ్లూ ప్రింట్ ఉంద‌ని చెప్పారు. ప్ర‌స్తుతం ఆహార అల‌వాట్లు మారుతున్నాయ‌ని మెట్ట పంట వేస్తే ఆదాయం పెరుగుతుంద‌ని అన్నారు. సంక్షేమం, అభివృద్ధి త‌మ‌కు రెండు క‌ళ్ల‌ని సూప‌ర్ సిక్స్ అమ‌లు చేస్తామ‌ని హామీ ఇచ్చారు. తాము అధికారంలోకి వ‌చ్చిన త‌ర‌వాత దేశంలో ఎక్క‌డా లేని విధంగా ఫించ‌న్ అమ‌లు చేస్తున్నామ‌ని అన్నారు.

Next Story