- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రెండు రాష్ట్రాలకు లాభమే..బనకచర్లపై మరోసారి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
by Ajay Maddhiboyina |
బనకచర్లపై సీఎం చంద్రబాబు మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. గోదావరిలో సంవత్సరానికి 2వేల టీఎంసీల నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయని అన్నారు.

X
దిశ, వెబ్ డెస్క్: బనకచర్లపై సీఎం చంద్రబాబు మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. గోదావరిలో సంవత్సరానికి 2వేల టీఎంసీల నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయని అన్నారు. అలాంటి నీళ్లు ఉపయోగించుకుంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలు సస్యశ్యామలం అవుతాయన్నారు. ఆ దిశగా ఆలోచించకపోతే రెండు రాష్ట్రాలు నష్టపోతాయని అన్నారు. అంతేకాకుండా అభివృద్ధి చేయడం కష్టం అని విధ్వంసం చేయడం చాలా సులభం అని అన్నారు. గత ఐదేళ్లలో ఏపీలో అదే జరిగిందని అన్నారు. దేనినైనా చెడగొట్టడం, పడగొట్టడం చాలా సులభం అని చెప్పారు. కుండెడు పాలల్లో విషం కలపడం ఈజీనే కానీ పాలను తయారు చేయడం కష్టం అని అన్నారు. రాష్ట్రాన్ని విధ్వంసం చేశారని, లక్షల కోట్లు అప్పులు చేశారన్నారు. కేంద్రం ఇచ్చే పథకాలను నిలిపివేశారన్నారు.
Next Story






