ప్రధానులు వెళ్లని రోజుల్లో నేను దావోస్ వెళ్లాను: చంద్రబాబు

by Ajay Maddhiboyina |   (  Updated:2025-05-30 14:04:31  IST  )

సీఎం చంద్ర‌బాబు ఢిల్లీలో జ‌రుగుతున్న సీఐఐ వార్షిక స‌మ్మేళ‌నంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. 1995 స‌మ‌యంలోనే తాను దావోస్ వెళ్లాన‌ని అన్నారు.

ప్రధానులు వెళ్లని రోజుల్లో నేను దావోస్ వెళ్లాను: చంద్రబాబు
X

దిశ, వెబ్ డెస్క్: సీఎం చంద్ర‌బాబు ఢిల్లీలో జ‌రుగుతున్న సీఐఐ వార్షిక స‌మ్మేళ‌నంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. 1995 స‌మ‌యంలోనే తాను దావోస్ వెళ్లాన‌ని అన్నారు. తాను దావోస్ వెళుతుంటే అక్క‌డ‌కు వెళితే మీకు ఇక్క‌డ‌ ఓట్లు ప‌డ‌వు అని కొంద‌రు అన్నార‌ని గుర్తు చేసుకున్నారు. దానికి కార‌ణం అక్క‌డ అంతా ఇండ‌స్ట్రియ‌లిస్టులు ఉంటారు.

మీరు వాళ్ల‌ను క‌లిస్తే ఒక రిచ్ వైబ్ వ‌స్తుంది. ఇక్క‌డ ఉండేది పేద‌లు కాబ‌ట్టి వాళ్లు ఓట్లు వేయ‌రు అని చెప్పేవ‌ర‌న్నారు. ఆ కాలంలో కేంద్ర‌మంత్రులు మ‌రియు ప్ర‌ధానులు కూడా దావోస్ వెళ్లలేద‌ని చెప్పారు. తాను ఒక్క‌డినే అప్ప‌టి నుండి ఇప్ప‌టి వ‌ర‌కు దావోస్ ప‌ర్య‌ట‌న‌కు వ‌స్తున్నానని తెలిపారు. తాను ప‌వ‌ర్ లోకి వ‌చ్చిన త‌ర‌వాత 1995 నుండి దావోస్ ప‌ర్య‌ట‌న‌కు వ‌స్తున్న‌ట్టు తెలిపారు. సంప‌ద సృష్టి జ‌ర‌గ‌క‌పోతే సంక్షేమ కార్య‌క్ర‌మాలు అమ‌లు చేయ‌లేమ‌ని చెప్పారు. పారిశ్రామిక‌వేత్త‌ల ద్వారానే సంప‌ద సృష్టి జ‌రుగుతుంద‌న్నారు. పారిశ్రామిక‌వేత్త‌లు ఏపీలో పెట్టుబ‌డులు పెట్టి అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరారు.

Next Story