Chandrababu: సీఎం జగన్‌పై చంద్రబాబు సంచలన ట్వీట్.. తోడబుట్టిన చెల్లి.. ఎంత నీచం అంటూ ఫైర్

by Shiva Kumar |
Chandrababu: సీఎం జగన్‌పై చంద్రబాబు సంచలన ట్వీట్.. తోడబుట్టిన చెల్లి.. ఎంత నీచం అంటూ ఫైర్
X

శ, వెబ్‌డెస్క్: ఏపీలో ప్రచార హోరు ఊపందుకుంది. ఇప్పటికే ప్రధాన పార్టీల అధినేతలు తమ అభ్యర్థుల గెలుపు కోసం వరుసగా బహిరంగ సభలు, ర్యాలీల్లో పాల్గొంటున్నారు. పొత్తులో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత వవన్ కల్యాణ్‌తో కలిసి రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే బాబు తన బహిరంగ వేదికల్లో ప్రచారాన్ని కొనసాగిస్తూనే.. సోషల్ మీడియా వేదికగా జగన్‌పై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. తాజాగా, ఆయన ట్విట్టర్‌లో వివేకా హత్య కేసుపై వైఎస్ షర్మిల, వైఎస్ సునీతను ఉద్దేశిస్తూ.. జగన్‌పై చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘తోడబుట్టిన చెల్లెలి పుట్టుక పైనా.. మహాలక్ష్మీగా భావించే ఇంటి ఆడబిడ్డ కట్టుకున్న చీరపైనా విమర్శలు చేసేవాడు ఒక ముఖ్యమంత్రా? ఎంత నీచం! ఇది కాదా వికృత మనస్తత్వం? అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం చంద్రబాబు వ్యాఖ్యలు ఆంధ్రా పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.

Read More..

తిరుపతిలో ఉద్రిక్తత..రాళ్లతో కొట్టుకున్న ఆ రెండు పార్టీల కార్యకర్తలు!





Next Story