- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Chandrababu Naidu arrest : ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి ఏసీబీ కోర్టు తలుపుతట్టారు.

దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి ఏసీబీ కోర్టు తలుపుతట్టారు. స్కిల్ స్కామ్ కేసులో బెయిల్ కోసం విజయవాడ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబు తరఫున ఆయన న్యాయవాదులు కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ బెయిల్ పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది. అయితే విచారణ తేదీని మాత్రం ఖరారు చేయలేదు. ఈ పిటిషన్ లిస్టింగ్ అయిన తర్వాతే విచారణ తేదీపై స్పష్టత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో రిమాండ్ రిపోర్టు కొట్టివేయాలని కోరుతూ చంద్రబాబు నాయుడు క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌పై ఈనెల 19న విచారణ జరగనుంది. మరోవైపు అంగల్లులో జరిగిన అల్లర్ల కేసులో చంద్రబాబు నాయుడు ఏ-1 నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ బెయిల్ పిటిషన్‌పై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. ఇరువాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను ఈనెల 20కు వాయిదా వేసింది.






