కాసేపట్లో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట.. అయోధ్యలో చంద్రబాబు, పవన్ సందడి

by Vemula.Srinu Prasad |   (  Updated:2024-01-22 05:18:49  IST  )

అయోధ్యలో అధ్యాత్మిక శోభ కళకళలాడుతోంది...

కాసేపట్లో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట.. అయోధ్యలో చంద్రబాబు, పవన్ సందడి
X

దిశ, వెబ్ డెస్క్: అయోధ్యలో అధ్యాత్మిక శోభ కళకళలాడుతోంది. ఏ విధి చేసినా శ్రీరామ స్మరణతో మారుమోగిపోతోంది. జగమంతా అంబరాన్నితాకేలా భక్తి పరావశ్యం కనిపిస్తోంది. అయోధ్య నగరమంతా శ్రీరాముడి భజనలు, కీర్తనలు, సాంస్కృతిక కార్యక్రమాలు అలరిస్తున్నాయి. అటు అయోధ్య ఆలయం పుష్పాలంకరణతో శోభిల్లుతోంది. ఇక అయోద్య రామయ్యకు హైదరాబాద్ నుంచి ముత్యాల గజమాల వెళ్లింది. ఇటు తెలుగు ప్రముఖులు, సినీ ప్రముఖుల సైత శ్రీరాముడి ప్రాణ ప్రతిష్టను తిలకించేందుకు అయోధ్య వెళ్లారు. ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, మెగా స్టార్ చిరంజీవి, ఆయన తనయుడు రామ్ చరణ్ తేజ్ తో పాటు పలువురు ప్రముఖులు సైతం అయోధ్యకు వెళ్లారు.

Next Story