- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కొలికపూడి వ్యవహారం నేను చూసుకుంటా.. పార్టీ నేతలతో భేటీలో చంద్రబాబు
టీడీపీ రాష్ట్ర నేతలతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. 2029 ఎన్నికలే లక్ష్యంగా పనిచేయాలన్నారు. కొలికపూడి అంశాన్ని తాను చూసుకుంటానని నేతలకు చెప్పారు. ఆయన విషయంలో ఎవరూ జోక్యం చేసుకోవద్దని క్రమశిక్షణ కమిటీకి సూచించారు.

దిశ, వెబ్ డెస్క్: టీడీపీ రాష్ట్ర నేతలతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. 2029 ఎన్నికలే లక్ష్యంగా పనిచేయాలన్నారు. కొలికపూడి అంశాన్ని తాను చూసుకుంటానని నేతలకు చెప్పారు. ఆయన విషయంలో ఎవరూ జోక్యం చేసుకోవద్దని క్రమశిక్షణ కమిటీకి సూచించారు. డిసెంబర్ 17లోగా జిల్లా, స్టేట్ కమిటీలు పూర్తి చేయాలని చెప్పారు. అంతే కాకుండా IVRS ద్వారా సర్వే చేసి కమిటీలు నియమించాలని సూచించారు. ఇదిలా ఉంటే టీడీపీలో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.
కొద్దిరోజుల క్రితం గత ఎన్నికల్లో తాను ఎమ్మెల్యే టికెట్ కోసం కేశినేని చిన్నికి రూ.5 కోట్లు ఇచ్చానని ఆరోపించారు. తరవాత కొలికపూడి అబద్దాలు ఆడుతున్నారని ఆయన వ్యాఖ్యలను చిన్ని ఖండించారు. అప్పటి నుండి కొలికపూడి తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా చాలా మంది తనపై దుష్ప్రచారం కావాలని అనుకుంటున్నారని చెప్పారు. ఆ విషయం తిరువూరులో ఉన్న ప్రతిఒక్కరికీ తెలుసన్నారు. పార్టీలు, కులాలకు అతీతంగా టీడీపీకి వ్యతిరేకంగా ఓటేసినవాళ్లు కూడా ఇప్పుడు ఎమ్మెల్యే అంటే నాలా ఉండాలంటున్నారని వ్యాఖ్యానించారు.






