- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Heavy Rain Alert:మరో నాలుగు రోజులు కుండపోత వర్షాలు.. ఆ జిల్లాల్లో పిడుగులు పడే ఛాన్స్!
రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది.

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. గత నాలుగు రోజులుగా ఏపీ(Andhra Pradesh)లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు(Heavy Rains) కురుస్తున్న విషయం తెలిసిందే. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. రోడ్లపై వరద నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఈ తరుణంలో నిన్న(మంగళవారం) కడప, చిత్తూరు, ఎన్టీఆర్, పల్నాడు, అనకాపల్లి, తిరుపతి, ప్రకాశం, కోనసీమ, కాకినాడ, కృష్ణా తదితర జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడ్డాయి. ఈ క్రమంలో APSDMA కీలక ప్రకటన చేసింది.
రాయలసీమ, పరిసర ప్రాంతాల పై సముద్రమట్టానికి 1.5 కి.మీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో రాబోయే నాలుగు రోజులు ఏపీలో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈ క్రమంలో ఇవాళ(బుధవారం) పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ప్రకాశం, పల్నాడు, నెల్లూరు, రాయలసీమ, అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులతో కూడిన వర్షం పడే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.






