- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టీటీడీ ఉద్యోగులకు హెల్మెట్లను పంపిణీ చేసిన చైర్మన్ బీఆర్ నాయుడు
టీటీడీ ఉద్యోగుల భద్రతను దృష్టిలో పెట్టుకొని.. చైర్మన్ బీఆర్ నాయుడు ఉద్యోగులకు హెల్మెట్లను పంపిణీ చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: టీటీడీ ఉద్యోగుల (TTD employees) భద్రతను దృష్టిలో పెట్టుకొని.. చైర్మన్ బీఆర్ నాయుడు (Chairman BR Naidu) ఉద్యోగులకు ఉచితంగా హెల్మెట్లను (Free helmets) పంపిణీ చేశారు. శనివారం ఉదయం తిరుమలలోని చైర్మన్ క్యాంపు కార్యాలయంలో ఈ హెల్మెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ.. తి రుమల నుంచి తిరుపతికి వచ్చే టీటీడీ ఉద్యోగులకు ప్రయాణ సమయంలో భద్రత కల్పించడంలో భాగంగా హెల్మెట్లు పంపిణీ చేయాలని నిర్ణయించామని అన్నారు.
ఉద్యోగులకు ఉచితంగా హెల్మెట్లు పంపిణీ చేసేందుకు గుంటూరుకు చెందిన జలాది రఘురామ్ (Jaladi Raghuram), ఢిల్లీకి చెందిన కేసీఎన్ హెల్మెట్ల తయారీ సంస్థ అధినేత నవీన్ (helmet company Naveen) ముందుకు వచ్చారని తెలిపారు. ఇందులో భాగంగా మొదటి విడతగా సుమారు రూ.5 లక్షలు విలువైన 555 హెల్మెట్లు విరాళంగా ఇచ్చారని చెప్పారు. 15 రోజుల్లో మరో 500 హెల్మెట్లను అందిస్తారని చెప్పారు. కాగా ఈ ఉచిత హెల్మెట్ల (Free helmets)ను పరిశీలించి క్వాలిటీ బాగున్నాయని బీఆర్ నాయుడు తెలిపారు. దీంతో మరో ఐదు వేల హెల్మెట్లు అందిస్తామని దాతలు ప్రకటించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ శాంతా రామ్, వీజీవోలు శ్రీ రామ్ కుమార్, శ్రీ సురేంద్ర, ఇతర అధికారులు పాల్గొన్నారు.






