Polavaram : పోలవరం సందర్శించిన కేంద్ర జల వనరుల పార్లమెంటరీ కమిటీ

by Y. Venkata Narasimha Reddy |   (  Updated:2025-01-11 07:18:01  IST  )

కేంద్ర జల వనరుల పార్లమెంటు కమిటీ(Central Parliamentary Committee on Water Resources) పోలవరం ప్రాజెక్టును(Polavaram Project) సందర్శించింది

Polavaram : పోలవరం సందర్శించిన కేంద్ర జల వనరుల పార్లమెంటరీ కమిటీ
X

దిశ, వెబ్ డెస్క్ : కేంద్ర జల వనరుల పార్లమెంటు కమిటీ(Central Parliamentary Committee on Water Resources) పోలవరం ప్రాజెక్టును(Polavaram Project) సందర్శించింది. కమిటీ చైర్మన్ రాజీవ్ ప్రతాప్ రూడీ(Committee Chairman Rajiv Pratap Rudy) ఆధ్వర్యంలో 15 మంది ఎంపీలు, 27 మంది అధికారుల బృందం ప్రాజెక్టును సందర్శించింది. ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు(Minister Nimmala Ramanaidu), పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు(MLA Chirri Balaraju)లు

పార్లమెంటరీ కమిటీకి స్వాగతం పలికారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల పురోగతి వివరాలను వారికి వివరించారు. కమిటీ సభ్యులు పోలవరం కాఫర్ డ్యాం, డయాఫ్రం వాల్, స్పిల్ వే, చానల్స్ ను పరిశీలిస్తున్నారు. పనుల సందర్శన అనంతరం ప్రాజెక్టు అధికారులు, ఇంజినీరింగ్ నిపుణులతో సమావేశమై నిర్మాణ తీరుపై సమీక్ష నిర్వహించనున్నారు.

పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన నిర్మాణ పనుల పురోగతి, సవాళ్లు, సమస్యలపై కేంద్ర ప్రభుత్వానికి పార్లమెంటరీ కమిటీ నివేదిక సమర్పించనున్నట్లు సమాచారం.

Next Story