- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీ జాలర్లను క్షేమంగా తీసుకువస్తాం : కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
బుధవారం బంగ్లాదేశ్ సముద్ర జలాల్లోకి పొరపాటుగా వెళ్లిన 8 మంది ఏపీ జాలర్లను అక్కడి కోస్ట్ గార్డ్ సిబ్బంది అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్ : బుధవారం బంగ్లాదేశ్ సముద్ర జలాల్లోకి పొరపాటుగా వెళ్లిన 8 మంది ఏపీ జాలర్లను అక్కడి కోస్ట్ గార్డ్ సిబ్బంది అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే అనుకోకుండా బంగ్లా జలాల్లోకి వెళ్లి, అక్కడి ప్రభుత్వం అదుపులో ఉన్నవారిని క్షేమంగా వెనక్కి తీసుకువస్తామని కేంద్ర పౌరవిమానయాన శాఖా మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఈ విషయంపై కొద్దిసేపటి క్రితమే విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ తో మాట్లాడినట్టు తెలిపారు. అలాగే బంగ్లాదేశ్ ఎంబసీతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని, వారందరినీ క్షేమంగా తీసుకువస్తానని రామ్మోహన్ నాయుడు వారి కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు.
అయితే వీరంతా విజయనగరం జిల్లా భోగాపురం మండలం కొండ్రాజుపాలెంకు చెందిన మత్స్యకారులు. మరుపల్లి చిన్న అప్పన్న, రమేష్, అప్పలకొండ, ప్రవీణ్, చిన్న అప్పన్న, రాము.. అలాగే పూసపాటి మండలం తిప్పలవలసకు చెందిన రమణ, రాములు ఈనెల 13న సముద్రంలో వేటకు వెళ్లగా... దారితప్పి 14న అర్థరాత్రి 2 గంటలకు బంగ్లాదేశ్ సముద్ర జలాల్లోకి ప్రవేశించారు. వీరిని బంగ్లా కోస్ట్ గార్డ్స్ అదుపులోకి తీసుకున్నారు. వీరి కుటుంబ సభ్యులను నేడు ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కలిసి, దైర్యం చెప్పారు.






