Central Government: 2024 వరకు సమర్థ్ పథకం పొడిగింపు

by Disha Web Desk 16 |
Central Government: 2024 వరకు సమర్థ్ పథకం పొడిగింపు
X

దిశ, డైనమిక్ బ్యూరో: జౌళి పరిశ్రమలోని కార్మికుల సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు కేంద్రం ప్రారంభించిన సమర్థ్ పథకం 2024 వరకు పొడిగించినట్లు కేంద్ర జౌళి శాఖ మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. జౌళి పరిశ్రమలోని కార్మికుల సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు కేంద్రం చేపట్టిన సమర్థ్ పథకం ద్వారా జరిగిన పురోగతి, ప్రస్తుత పరిస్థితిపై ఎంపీ చింతా అనురాధ పార్లమెంట్‌లో ప్రశ్నించారు. ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్ర జౌళి శాఖ మంత్రి పీయూష్ గోయల్ లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు.


సమర్థ్ పథకాన్ని జౌళి పరిశ్రమలో కార్మికుల సామర్థ్యాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిందని, దీని ద్వారా 2017 - 2020 సంవత్సరాల్లో 10 లక్షల మందికి శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుందని మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. అయితే కొవిడ్ వల్ల ఈ శిక్షణా కార్యక్రమం ఒడిదుడుకులకు గురైందని..ఇప్పటి వరకూ దేశంలోని అన్నీ రాష్ట్రాల నుండి 1,53,047 మందికి శిక్షణ పూర్తి చేశారని చెప్పుకొచ్చారు. ఈ కారణంగా సమర్థ్ పథకాన్ని మార్చి 2024 వరకూ పొడిగించి ఇందుకు రూ.390 కోట్ల నిధులు కేటాయించడం జరిగిందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు.



Next Story